డ్రాగా ముగిసిన భారత్, పాకిస్థాన్ పోరు

కరోనా పరిస్థితులు నెమ్మదించడంతో క్రమంగా క్రీడా పోటీల నిర్వహణ ఊపందుకుంటోంది. కరోనా ప్రభావం వల్ల గత రెండేళ్లుగా అనేక టోర్నీలు నిలిచిపోవడం తెలిసిందే. మునుపటితో పోల్చితే ఇప్పుడు కరోనా ప్రభావం నామమాత్రం కావడంతో క్రీడా కార్యకలాపాలు ముమ్మరం అయ్యాయి. ఈ నేపథ్యంలో, ఇండోనేషియాలో ఆసియా కప్ హాకీ టోర్నీ షురూ అయింది.

ఇవాళ జకార్తాలో జరిగిన మ్యాచ్ లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ లో తొలి గోల్ భారత్ నమోదు చేసింది. మొదటి క్వార్టర్ లోనే భారత ఆటగాడు కార్వీ సెల్వమ్ గోల్ సాధించాడు. దాంతో భారత్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అక్కడ్నించి పాక్ పై భారత్ దే పైచేయిగా నిలిచింది. కానీ చివర్లో పాక్ ఆటగాడు అబ్దుల్ రాణా పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలిచి స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత ఇరుజట్లు మరో గోల్ చేయలేకపోవడంతో మ్యాచ్ 1-1తో డ్రా అయింది.

Leave a Reply