Suryaa.co.in

Andhra Pradesh

పరదాలు లేవు …పోలీసుల అతి లేదు

– ప్రశాంతమైన వాతావరణంలో అసెంబ్లీ సమావేశాలు
– గత ఐదేళ్లలో పాకిస్థాన్ బోర్డర్ ను తలపించేలా అసెంబ్లీ పరిసర ప్రాంతాలు
– ప్రజా ప్రభుత్వంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా సాధారణ జనజీవనం
– స్వేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్న జనం
– ఔరా ఎంత మార్పు అంటూ ప్రజల్లో విస్తృతమైన చర్చ

అమరావతి: అక్కడ నిజంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయా? అందులోనూ బడ్జెట్ సమావేశాలా? అసలు హడావిడే లేదేంటి? బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా అటుగా వెళ్తున్న సామాన్య ప్రజల మనస్సులో మెదులుతున్న ప్రశ్నలు ఇవి. వైసీపీ ఐదేళ్ల పాలనలో అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు గుర్తుచేసుకుంటూ ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

ఐదేళ్ల రాక్షస పాలనలో అసెంబ్లీ పరిసర ప్రాంతాలు పాకిస్థాన్ బోర్డర్ ను తలపించేయి. జగన్ జమానా లో అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో రోడ్లపై నర మానవుడు కనిపించడానికి వీలు లేదని ఆంక్షలు విధించారు. అసెంబ్లీ కి దాదాపు 20 కిలోమీటర్ల ముందు నుండే ఆంక్షల వలయం ప్రారంభం అయ్యేది. ఆనాడు ముఖ్యమంత్రి గా ఉన్న జగన్ తాడేపల్లి నివాసం పరిసర ప్రాంతాల్లోనూ, అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లోనూ 144 సెక్షన్ అమలులో ఉండేది. రోడ్ల పై బ్యారికేడ్లు, వేల మంది పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ టీంలు, పరదాలు, షాపులను మూసివేయించడం ఇలా ఒక్కటేంటి సామాన్యులకు చుక్కలు చూపించేవారు.

ప్రతి ఇంటి ముందు పరదా పట్టించి కానిస్టేబుల్ ను నిలబెట్టేవారు. మార్గమధ్యంలో ఉన్న షాపులు, చిన్న కిరాణా కోట్లు, టిఫిన్ సెంటర్లు అన్ని బలవంతంగా మూయించేవారు. ప్రజలు ఇళ్లు వదిలి బయటకు రాకూడదు అని ఆంక్షలు విధించేవారు. ఆనాటి ప్రభుత్వం అంత అభద్రతా భావంతో ఉండేది. కాల చక్రం గిర్రున తిరిగినట్టు ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది.

ప్రజాస్వామ్యం ఊపిరి పీల్చుకుంది. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు తొలగాయి. పరదాలు లేవు పోలీసులూ నామ మాత్రంగానే ఉన్నారు. షాపులు మూసెయ్యాలనే ఒత్తిళ్లు లేవు, బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నా, మంత్రులు, ముఖ్యమంత్రి అటుగా వెళ్తున్నా జన జీవనం మాత్రం సామాన్యంగా జరిగిపోతుంది. ఇప్పటికి ఇప్పటికి ఉన్న తేడా గమనిస్తే అందరూ షాక్ అవ్వడం ఖాయం. జగన్ హయాంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అంటే 2847 మంది పోలీసులను రంగంలోకి దించేవారు. 144 సెక్షన్ అమలు దగ్గర నుండి ప్రతి ఇంటి వద్దా పరదాలు పట్టుకొని పోలీసులు డ్యూటీ చేసేవారు.

అడిషనల్ ఎస్పీ లు అధికారులు 7 గురు , డిఎస్పిలు- 30 మంది, సిఐ లు/ ఆర్ఐ లు – 80 మంది, ఎస్ఐ లు -150 మంది, మహిళా ఎస్ఐ లు -30 మంది, ఏఎస్ఐ లు – హెడ్ కానిస్టేబుళ్లు- 400 మంది, కానిస్టేబుళ్లు – 600 మంది, మహిళా పొలిసు కానిస్టేబుళ్లు- 200 మంది, యాంటీ నక్సల్ స్క్వాడ్- 400 మంది, ఆర్మ్ రిసర్వ్డ్ – 300 మంది , హోమ్ గార్డ్స్ – 350 మంది, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ( ఏపి ఎస్ పి ) – 300 మంది మొత్తంగా కలిపి 2847 మందిని కేవలం అసెంబ్లీ సమావేశాల భద్రత కోసం వినియోగించేవారు.

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు ప్రశాంతమైన వాతావరణంలో జరగాలి అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. బయటకు కనిపించే పోలీసింగ్ తగ్గించి టెక్నాలజీ వినియోగం ద్వారా మెరుగైన భద్రత కల్పించాలని దానికి అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పడంతో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో సాధారణ వాతావరణం కనిపిస్తుంది.

ప్రజా ప్రభుత్వంలో కేవలం 525 మందితో భద్రత కల్పిస్తున్నారు. అడిషనల్ ఎస్పీ లు అధికారులు 3 గురు , డిఎస్పిలు- 8 మంది, సిఐ లు/ ఆర్ఐ లు – 14 మంది, ఎస్ఐ లు – 15 మంది, ఏఎస్ఐ లు – హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు- 150 మంది,మహిళా పొలిసు కానిస్టేబుళ్లు- 23 మంది, ఆర్మ్ రిసర్వ్డ్/ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ( ఏపి ఎస్ పి ) – 211 మంది , హోమ్ గార్డ్స్ – 101 మంది మొత్తంగా – 525 మంది మాత్రమే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో భద్రతకు వినియోగిస్తున్నారు. గత వైసిపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన భద్రత కంటే 81.6 శాతం తక్కువ మంది పోలీసులతోనే ప్రజా ప్రభుత్వం ఇప్పుడు భద్రతా ఏర్పాట్లు చేసింది.

దీనితో చుట్టు పక్కల గ్రామాల వారు, ఉద్యోగులు, కాలేజ్ కి వెళ్లే విద్యార్థులు, కార్మికులు, రైతులు, ప్రజానీకం ఆనందాన్ని వ్యక్తం చేసున్నారు. గతంలో మా ఇంటికి మేము వెళ్ళాలి అన్నా, ఇంటి నుండి బయటకు రావాలి అన్నా పోలీసులు ఒప్పుకునేవారు కాదు, అనేక ఆంక్షలు పెట్టేవారు ఇప్పుడు అటువంటి ఇబ్బందులు ఏమి లేవు, స్వేచ్చగా రోడ్ల మీద తిరగగలుగుతున్నాం అంటూ ప్రజాప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు.

LEAVE A RESPONSE