Suryaa.co.in

Andhra Pradesh

పేద, బడుగు, బలహీన వర్గాలకు మేలు చేసే బడ్జెట్

– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య హర్షం

అమరావతి: ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా బడ్జెట్ ఉంది. సీఎం చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా.. పేద వర్గాలకు మేలు చేయడంతో పాటు అభివృద్ధి, సంక్షేమానికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ లో అగ్ర తాంబూలం వేశారు. గత అరాచక ప్రభుత్వం వలన రాష్ట్రం అంధకారంలో పడి అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ప్రవేశ పెట్టిన మొట్టమొదటి పూర్తిస్థాయి బడ్జెట్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేయిస్తుంది.

పేదలను పేదరికం నుండి బయట పడేస్తుంది. బలహీన వర్గాలకు బలమై వారు ఆర్థికంగా నిల దొక్కుకునేలా ఉతమిస్తుంది. కూటమి ప్రభుత్వం రైతే ముందు అనే నినాదంతో నడుస్తుంది. బడ్జెట్లో కేటాయింపుల ద్వారా దీన్ని ఆచరణలో చూపించారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం వంటి పథకాలకు నిధులు కేటాయించి మహిళలు, రైతుల పట్ల ఉన్న చిత్తశుద్దిని ప్రజలకు తెలియచేశారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి వారి సంక్షేమానికి వెన్నుదన్నుగా నిలిచారు. ఎస్సీల సంక్షేమానికి రూ.20,281 కోట్ల కేటాయింపుతో పాటు ఎస్టీల సంక్షేమానికి రూ.8,159 కోట్లు కేటాయించడం.. వారి సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు ఎస్టీలకు రూ.75 వేలు, ఎస్సీలకు రూ. 50 వేలు ఆదీవాసీలకు రూ. లక్ష చొప్పున అదనంగా ఇవ్వడం.. చంద్రబాబుకు కూటమి ప్రభుత్వానికి పేదలపై ఉన్న అపారమైన ప్రేమకు ఇదే నిదర్శనం.

ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇవ్వడంతో పాటు నాణ్యమైన విద్య, వైద్యం, జీవనోపాధి, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాథి వంటి అనేక కార్యక్రమాలను అమలు చేసి వారి అభివృద్ధికి పాటుబడుతూ.. బలహీన వర్గాలకు కొండంత బలమై వారికి సమాజంలో సరైన గుర్తింపును ఇచ్చేందుకు చంద్రబాబు చేస్తున్న కృషి అభినందనీయం అని వర్ల రామయ్య కొనియాడారు.

LEAVE A RESPONSE