8వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు

-కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ ఆధారిటీ ఏర్పాటు
-హై కోర్టుకు 100 ఎకరాల భూమి
-ఖైదీల విడుదలకు చర్యలు
-టి.జి పేరుతోనే వాహనాల రిజిస్ట్రేషన్
-నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్దరణ
-మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

8 వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ ఆధారిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాము. ఐ.టి.ఐ కాలేజీలను అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాము. రాష్ట్ర హై కోర్టుకు 100 ఎకరాల భూమిని కేటాయిస్తూ క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నాము. జైళ్లల్లో మగ్గుతున్న ఖైదీల విడుదలకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తూ నిర్ణయం తీసుకున్నాము.

ఇక నుండి టి.జి పేరుతోనే వాహనాల రిజిస్ట్రేషన్ జరుగుతుంది.ప్రజల భాగస్వామ్యం వుండే విధంగా తెలంగాణ చిహ్నంను మార్చాలని నిర్ణయం తీసుకున్నాము. ఆరు గ్యారెంటీల అమలు విషయంలో ఎలాంటి అపోహ లేదు. గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసినా ప్రజల హామీలు నెరవేరుస్తాము. వ్యవసాయ శాఖలో ఏ.ఓ లను భర్తీ చేయాలని చర్చ జరిగింది. గ్రూప్స్ నోటిఫికేషన్ కు సంబంధించిన ప్రక్రియను మొదలుపెట్టాము.

తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో ప్రజల భాగస్వామ్యం ఉండాలి. నూతన తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందిస్తాము. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్దరణ చేయాలని క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం. మ్యానిఫెస్టోలో పెట్టిన అన్ని అంశాలను ప్రణాళికాబద్దంగా అమలు చేస్తాము. రాహుల్ గాంధీ ఆలోచనా విధానానికి అనుగుణంగా రాష్ట్రంలో కులగణన చేయాలని క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నాము.

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీ సైతం పోరాటం చేసింది. తెలంగాణకు రావాల్సిన నదీ జలాలపై పది ఏళ్ళు బిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి బిఆర్ఎస్ బేషరతుగా మద్దతు ఇచ్చింది. గోదావరిలో లక్షా 20 వేల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టి ప్రజా ధనం దుర్వినియోగం చేశారు.

Leave a Reply