ఉండవల్లిః అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 24 నుంచి నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 25 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఫిబ్రవరి నెలాఖరులో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. కాగా కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే.