బ్రాందీ షాపుల వద్ద టీచర్లకు డ్యూటీలు వేయటం దుర్మార్గపు చర్య

– ఉపాధ్యాయులకు 43% ఫిట్మెంట్ ఇచ్చిన ఘనత టిడిపిది

ఉపాధ్యాయులను అగౌరవ పరుస్తూ కరోనా సమయంలో బ్రాందీ షాపుల వద్ద వైసిపి ప్రభుత్వం డ్యూటీలు వేయటం ఎంతో బాధాకరమని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు.

వినుకొండ పట్టణంలోని నరసరావుపేట రోడ్డు లో గంగినేని కళ్యాణ మండపం నందు మంగళవారం ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఊడిగ గురవయ్య మాస్టారు అధ్యక్షతన నిర్వహించగా ముఖ్యఅతిథిగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, ఆయన సతీమణి లీలావతి, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులను మోసం చేశారని అన్నారు. ఉపాధ్యాయులకు 43% అత్యధిక ఫిట్మెంట్ ఇచ్చి ఆదుకుంది టిడిపి ప్రభుత్వమని అన్నారు. టిడిపి జనసేన బిజెపి సంయుక్తంగా అధికారంలోకి రాగానే ఉద్యోగులు ఉపాధ్యాయులు స్వేచ్ఛగా విధులు నిర్వహించుకునే వాతావరణం కల్పిస్తుందని అన్నారు. ఉద్యోగులు ఉపాధ్యాయుల వేతనాలు సకాలంలో చెల్లించలేని దివాలా కోడ్ ప్రభుత్వమని, వారిని రకరకాల సాగుతో జగన్ రెడ్డి ప్రభుత్వం వేధింపులకు గురి చేయటం దుర్మార్గమన్నారు.

రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక పాలనను ప్రజల్లో ఎండగట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల్లో చైతన్యాన్ని నింపి ప్రభావితం చేయగలిగే శక్తి ఉపాధ్యాయులకు ఉందని తెలిపారు. ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి వినుకొండ నియోజకవర్గం లోని ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు అత్యధికంగా పాల్గొన్నారు.

కన్నా రజినీ ,గంగినేని రాఘవ , రాష్ట్ర మాజీ ఎస్టీ సెల్ కార్పొరేషన్ చైర్మన్ దారు నాయక్, హెచ్ఎం అసోసియేషన్ నాయకులు జై శ్రీనివాసరావు, యుటిఎఫ్ సీనియర్ నాయకులు ఏ నాగేశ్వరరావు, రిటైర్డ్ టీచర్ బాలకృష్ణ, యుటిఎఫ్ సీనియర్ నాయకులు వెంకట రెడ్డి , ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రజిత్ యాదవ్, ఎస్ టి యు ఏరియా కార్యదర్శి వి ఆంజనేయులు, అదనపు కార్యదర్శి పి రమేష్, ఏ పి టి ఎఫ్ 1938 జిల్లా ప్రధాన కార్యదర్శి శివ నాగరాజు, పిఆర్టియు అధ్యక్షులు డివి రామారావు, జిల్లా నాయకులు శ్రీనివాసరావు, ఏపీటీఎఫ్ 257 జిల్లా కార్యదర్శి షేక్ షరీఫ్, జిల్లా ఉపాధ్యక్షులు తమ్మిశెట్టి శ్రీనివాసరావు. ఏపీటీఎఫ్ 257 అధ్యక్షులు షేక్ మొహమ్మద్, ఏపీ Apcpsea పార్థసారథి పూర్వ ప్రధాన కార్యదర్శి, ఎన్టిఏ స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బీవి నాగేశ్వరరావు, ఎన్ టి ఏ జిల్లా అధ్యక్షులు సెల్వరాజ్, పిడి స్టేట్ జాయింట్ సెక్రెటరీ రాధాకృష్ణ ,పిడి వినుకొండ శాఖ సెక్రెటరీ వీరాంజనేయులు, ఆర్ యు పి పి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగ మునియ్య, జిల్లా యువజన విద్యా కార్యదర్శి కే వెంకటేశ్వర్లు, రిటైర్డ్ టీచర్ జి నాగేంద్రుడు గిరిజన గురుకుల పాఠశాల తిరుపతి నాయక్, ఎంపీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజా చౌదరి, ప్రత్యేక ఆహ్వానితులుగా సీనియర్ ఉపాధ్యాయులు బి గోవింద ,నాయక్, వి ప్రకాష్ వి జ్యోతి, ఓ శ్రీనివాస్, చంద్రమౌళి, ప్రసాదు హాజరయ్యారు.

Leave a Reply