నరసరావుపేటలో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు

-టీడీపీ కార్యకర్తల పై రాళ్ల,సీసాలతో మూకుమ్మడిగా దాడి
-టీడీపీ శ్రేణులకు గాయాలు
-టీడీపీ కార్యకర్తలను ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స

నరసరావుపేట పట్టణంలో స్థానిక 05 వార్డ్ క్రిస్టియన్ పాలెంలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయి దాడులకు తెగ పడుతున్నారు.మంగళవారం సాయంత్రం నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి డా.చదలవాడ అరవింద బాబు,టీడీపీ కార్యకర్తలు వార్డులలో పర్యటిస్తున్న సమయంలో టీడీపీ కార్యకర్తలు,నాయకులే లక్ష్యంగా వైసీపీ నాయకులు,కార్యకర్తలు ఒక్కసారిగా రెచ్చిపోయి మూకుమ్మడిగా రాళ్ల,సీసాలతో దాడి చేశారు.ఈ దాడిలో టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి.గాయపడిన టీడీపీ కార్యకర్తలను,నాయకులను ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి డా. చదలవాడ అరవింద బాబుకి స్వల్ప గాయాలయ్యాయి.

Leave a Reply