– అంబేద్కర్ కన్నా డబ్బే ఎక్కువ అంటూ జగన్ మనసులోని మాటను బహిరంగపరిచారు
– అంబేద్కర్ కు వైకాపా చేసిన అవమానాన్ని దళిత జాతి క్షమించదు
– మాజీ మంత్రి కె ఎస్ జవహర్
అంబేద్కర్ విదేశీ విద్యకు చంద్రబాబు 5 వేల మందిని విదేశాలకు పంపారు . జగనన్న విదేశీ విద్యకు 5 ఏళ్ల పాలనలో విదేశాలకు పంపింది 300 మందిని మాత్రమే. అంబేద్కర్ పేరుకన్నా డబ్బే ఎక్కువ అంటూ జగన్ మనసులోని మాటను జూపూడి బహిరంగపరిచారు.
అంబేద్కర్ విదేశీ విద్య పథకంలో అంబేద్కర్ పేరు తొలగించి ఆ స్థానంలో జగనన్న విదేశీ విద్యగా మార్పు చేయడాన్ని సమర్థించుకోవడాన్ని జూపూడి ఆత్మవంచన చేసుకుని దిగుజారుడు వాదం తెరపైకి తెచ్చారు. జగన్ రెడ్డి దొడ్డిలో డబ్బుకు తప్ప మనుషులకు, మహాత్ములకు విలువ లేదు. జగన్ ధన ఉన్మాద ప్రభావంతో జూపూడి ప్రభాకర్ అంబేద్కర్ కన్నా డబ్బే ఎక్కువ అంటూ జగన్ మనసులోని మాటను బహిరంగపరిచారు. పిడికెడు ఆత్మగౌరవం కోసం దళితులు ఆత్మ బలిదానాలకు సైతం వెరవకుండా పోరాడుతున్న సమయంలో ఇలా అంబేద్కర్ ను అవమానపర చడం దళిత ద్రోహం అవుతుంది.
చంద్రబాబు అంబేద్కర్ విదేశీ విద్యా పథకం ప్రవేశపెట్టి తన ఐదేళ్ల పాలనలో ఐదు వేల మందిని ఉన్నత విద్యకు విదేశాలకు పంపారు. దళితుల్ని వారి కాళ్లపై నిలబెట్టారు. జగన్ అంబేద్కర్ విదేశీ విద్య పథకాన్ని రద్దు చేశారు. దళితులు నిలదీయడంతో అంబేద్కర్ పేరు తొలగించి జగనన్న విదేశీ విద్యా పథకం అని పేరు మార్చి కేవలం ఐదేళ్ల పాలనలో మూడు వందల మందిని మాత్రమే విదేశాలకు పంపారు.
అనేక షరతులు పెట్టి పేద దళితుల్ని విదేశీ విద్యకు దూరం చేశారు. ఏ రకంగా చూసినా జగన్ చేసింది దళిత ద్రోహమే. దీన్ని నిలదీయకుండా అబద్ధాలతో సమర్థించడం ఆత్మవంచన మాత్రమే. అంబేద్కర్ కు వైకాపా చేసిన అవమానాన్ని దళిత జాతి క్షమించదు.