Suryaa.co.in

Andhra Pradesh

ప్రజలకి కావాల్సింది భరోసా,భజనలు కాదు

– తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దివ్యవాణి
కేవలం రెండున్నరేళ్ళకే, ఇలా అన్ని వర్గాల నుంచి అసమ్మతి సెగలు పుట్టుకొచ్చిన ప్రభుత్వం ఏదయినా ఉంది అంటే కేవలం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే. ఒక పక్క పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతునము అని చెప్పి లక్షల కోట్లు రూపాయల అవినీతి కి పాల్పడిన పార్టీ ఏదయినా ఉంది అంటే అది కేవలం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే.
కేవలం రెండున్నర సంవత్సరలో లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి, కనీసం ఏ బ్యాంక్ నుంచి కూడా అప్పులు తెచ్చే పరిస్థితి లేని ప్రభుత్వ ఏదయినా ఉంది అంటే అది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే. ఒక్కప్పుడు యావత్ ప్రపంచానికి ఒక ఐకాన్ లాగా ఉన్న పెద్ద రాష్టానికి రాజధాని లేని రాష్టం ఏదయినా ఉంది అంటే అది కేవలం జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్న ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఇలా చెప్పుకుంటు పోతే జగన్ మోహన్ రెడ్డి అసమర్థ పాలన పై చాట భారతం అంత కధనాలు ఉన్నాయి..
గురివింద గింజ కి తన నలుపు ఎరగనట్లు ఇంకా కూడా జగన్ ప్రభుత్వం లో కొంత మంది మహిళ శాసనసభ్యులు నిండు ఆసంబ్లీ లో జగన్ జపం చేస్తూ రాబోయే రోజుల్లో మంత్రి వర్గ విస్తరణలో లో మంత్రి పదవి కోసం పాకులాడే పనిలో పడ్డారు.
ఆసంబ్లీ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక పవిత్ర దేవాలయం లాంటిది అలాంటి దేవాలయం లో రావణసురుడి లాంటి జగన్ భజన చేయడం , మంత్రి పదవులు కోసం ఊడిగం చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్న.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమస్య ల సుడిగుండంలో ఉంటే ప్రభుత్వలో ఉన్న ముఖ్యమంత్రి, మంత్రులు బృందానికి సమస్యలు పరిష్కరించాలని సొయ లేకపోవడం శోచనీయం..
జగన్ పాలన లో రాష్ట్రానికి కనీసం రాజధాని ఎక్కడ ఉందో తెలియని అయోమయంలో జగన్ మేన అల్లుళ్ళు, మేన కోడళ్ల గా చెప్పుకునే విద్యార్థులు కూడా అయోమయంలో ఉన్నారు దీనికి సిగ్గుతో తాలవంచు కోవాల్సింది పోయి ఇంకా జగన్ జపం చేస్తున కొంతమంది శాసనసభ్యులు తీరు చూస్తుంటే బాధగా ఉంది.
రోజు రోజుకి పెరిగిపోతున్న నిత్యావసర సరుకుల ధరలు అప్పుల ఊబిలో అతలాకుతలం అవుతున్నా ఆంధ్రప్రదేశ్ , కనుచూపు మేర కనపడని పెట్టుబడులు, జీతాలు కోసం ఎదురు చూసే ప్రభుత్వ ఉద్యోగులు, దారుణమైన రోడ్డులు, పట్టపగలు మహిళలకు లేని భద్రత, ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఏది చూసినా మొత్తం అయోమయంలో ఉంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పడానికి బాధ గా ఉంది..
ఆ వర్గం, ఈ వర్గం అని లేదు అన్ని వర్గాలది అదే పరిస్థితి. సొంత సామాజికవర్గం కూడా జగన్ కు దండం పెడుతున్నారు అంటే మనం ఏ స్థితిలో ఉన్నామో అర్ధం చేసుకోవచ్చు .
జగన్ ప్రభుత్వ వైఖరి పై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందొ ప్రజల్లోకి వెళ్తే కదా తెలిసేది.. ముఖ్యమంత్రి ప్రజల్లోకి రారు, ప్రజాలని తాడేపల్లి ప్యాలస్ లో కలవాడు ఇంకా ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయి ..
యెస్ గర్వంగా చెప్పగలను చంద్రబాబు నాయుడు హయాంలో ప్రతి వ్యక్తి గర్వంగా చెపుకున్నారు నాది ఆంధ్రప్రదేశ్ అని ..ఇప్పటికి ఏ తెలంగాణ మంత్రి ని అడిగిన తెలంగాణ ముఖ్యమంత్రి ని అడిగిన గుండె మీద చేయి వేసుకొని చెప్తారు హైదరాబాద్ మహా నగరం కట్టడం చంద్రబాబు నాయుడు విజన్ కి నిదర్శనం అని . కొంత మంది నిండు ఆసంబ్లీ లో మాట్లాడే మాటలు వింటుంటే ఒక మహిళగా నాకే సిగ్గువేస్తుంది.
ఒక మహిళ శాసనసభ్యురాలు ఏమో కుప్పం గడ్డ జగన్ అడ్డ అంటుంది , ఒక మహిళ సభ్యురాలు ఒక్క కంటి నుంచి కన్నీరు కారుస్తుంది ,నిండు ఆసంబ్లీ లో ప్రజా సమస్యల గురుంచి మాట్లాడాల్సిన మీరు ఇలా భజన చేయడం ఏంటో విడ్డురం గా ఉంది .
నిన్న నగరి శాసనసభ్యురాలు రోజా కుప్పం గడ్డ ,జగన్ అన్న అడ్డ , చంద్రబాబు ఐస్ గడ్డ అని ఎద్దేవా చేసి మాట్లాడారు.. అవును నిజమే చంద్రబాబు నాయుడు గారి చలువ వాళ్లే రెండూ తెలుగు రాష్టల ప్రజలు చల్లగా ఉన్నారు.. అలాంటి చల్లనిపాలన నుంచి ఏ రోజు ఏ అప్పుల వాళ్ళు రాష్టానికి వస్తారో అని సామాన్యులు సైతం భయపడే రోజు కి వెళ్ళాము ..ఇది మీరు భజన చేసే ముఖ్యమంత్రి పని తీరు ఇప్పటికైన తమతప్పులు తెలుసుకొని ప్రజా సమస్యలపై పరిష్కారం దిశగా అడుగులు వేయాలని కోరుకుంటున్నా.

LEAVE A RESPONSE