తెలుగుదేశం కార్యకర్తలెవరూ ఆత్మహత్యాయత్నాలకు పాల్పడొద్దు

– పార్టీ కేడర్ కు తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుంది
– వైసీపీ అరాచకశక్తులపై కలసికట్టుగా పోరాడదాం
– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపు
తెలుగుదేశం పార్టీ అభిమానులెవరూ ఆత్మహత్యా యత్నాలకు పాల్పడొద్దు…తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుని అసెంబ్లీ సాక్షిగా అవమానిస్తూ వారి కుటుంబసభ్యులపై వైసిపి నేతల అనుచితుల వ్యాఖ్యలకు ఆందోళనకు గురై మనస్థాపంతో రెండు తెలుగురాష్ట్రాల్లో పలువురు కార్యకర్తలు, అభిమానులు ఆత్మహత్యా యత్నానికి పాల్పడుతున్నట్లు సమాచారం అందుతోంది. పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎటువంటి ఉద్వేగాలకు గురికాకుండా సంయమనం వ్యవహరించాల్సిందిగా విజ్జప్తి చేస్తున్నాను. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కార్యకర్తలకు మెరుగైన వైద్యసహాయం అందించానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ కుటుంబసభ్యులకు ఏ చిన్న గాయమైనా పార్టీ అధినేత చంద్రబాబు మనసు మరింత గాయపడుతుందని పార్టీ కేడర్ గుర్తించాల్సిందిగా విజ్జప్తి చేస్తున్నాను. రాష్ట్రంలో వైసిపి అరాచకాలపై ఇక ముందుకూడా కలసికట్టు మనోనిబ్బరంతో పోరాటం కొనసాగిద్దాం.