షార్జా నుంచి విజయవాడకి అంతర్జాతీయ విమాన సర్వీసులు

Spread the love

షార్జా నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈరోజు నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి వారానికి రెండు రోజులపాటు ఈ సర్వీసులు ప్రతి శనివారం సోమవారం నడవనున్నాయి. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలిసారిగా వచ్చిన విమానానికి ఫైర్ సిబ్బంది రాయల్ వాటర్ సెల్యూట్ ని పలికారు. అనంతరం ప్రయాణికులకు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్,విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం డైరెక్టర్ M. లక్ష్మి కాంత్ రెడ్డి,ఇతర ప్రముఖులు స్వాగతం పలికారు. అనంతరం విజయవాడ నుంచి వెళుతున్న ప్రయాణికులకు బోర్డింగ్ పాసులను ముఖ్య అతిథులు అందజేశారు. షార్జా నుంచి ఈ విమానంలో 50 మంది రాగా విజయవాడ నుంచి షార్జాకు 122 మంది వెళ్లారు.

Leave a Reply