ఏయూ విసి ప్రసాద్ రెడ్డిని తొలగించాలి

విద్యార్థి, యువజన సంఘాల నేతలు డిమాండ్

విశాఖపట్నం:- ఉత్తరాంధ్ర జిల్లాలకు తలమానికంగా ఉన్నటువంటి ఆంధ్ర విశ్వావిద్యాలయంను వైసిపి కార్యాలయంగా మార్చడంలో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేనటువంటి వైసిపి పార్టీ కార్యకర్త ప్రసాదరెడ్డిని రెండవసారి వైస్ ఛాన్స్లర్గా నియమించడాన్ని అఖిల భారత విద్యార్థి సమైక్య అఖిల భారత యువజన సమైక్య నేతలు ఆరోపించారు.

గురువారం సాయంత్రం ఏయూ మెయిన్ గేట్ ఎదురుగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ యూనివర్సిటీ చరిత్రను, యూనివర్సిటీ పరువును పూర్తిగా తుంగలోకి తొక్కుతూ రాజకీయ పార్టీ కార్యక్రమాలకు అడ్డాగా ఆంధ్ర యూనివర్సిటీని గతంలో వీసీగా ఉన్న ప్రసాద్ రెడ్డి మార్చారని విమర్శించారు. ఆయనపై ఇప్పటికే కోర్టులో కేసు ఉందని, అనేక విద్యార్థి, పౌర ప్రజాసంఘాలు, మేధావులు ప్రసాద్ రెడ్డి అక్రమాలను ప్రశ్నించిన్నారని గుర్తు చేశారు.

మరలా అవేవి పట్టనట్టు ప్రభుత్వం మళ్ళీ అదే ప్రసాద్ రెడ్డిని నియమించి యూనివర్సిటీ పరువును మంట కలిపితే చూస్తూ ఊరుకోమని ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ గా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పర్చూరు రాజేంద్ర బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కి లెనిన్ బాబు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వి జాన్సన్ బాబు లతో పాటు విద్యార్థి యువజన సంఘాల నేతలు పాల్గొన్నారు.

Leave a Reply