– తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబు రాజేంద్రప్రసాద్
మచిలీపట్నం : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చేపట్టిన రిలే నిరాహార దీక్షకు మద్దతుగా మచిలీపట్నం నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర చేపట్టిన నిరాహారదీక్షకు మద్దతుగా ఉమ్మడి కృష్ణాజిల్లాలోని సర్పంచులను తీసుకువెళ్లి సంఘీభావం తెలియజేసి ప్రసంగించిన రాజేంద్రప్రసాద్.
ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ… మహాత్మా గాంధీజీ సత్యమేవ జయతే అని సమాజాన్ని మంచి మార్గంలో నడిపితే, ఈ జగన్ ఆ పదాన్ని అసత్యమేవ జయతే గా మార్చేశాడు. ఎటువంటి ఆధారాలు లేని కేసులు పెట్టి , రాజకీయ కక్షలో భాగంగా జగన్ శునకానందం పొందుతున్నాడు.ఎప్పటికైనా చెడుపై మంచి విజయం సాధిస్తుంది. చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యం వలే బయటకు వస్తారు ఈ జగన్ అరాచక పాలనను రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో వాళ్లే తగిన బుద్ధి చెబుతారు.