Suryaa.co.in

Andhra Pradesh

వాసుదేవరెడ్డికి చుక్కలే!

– వాసుదేవరెడ్డి భూ కొనగోళ్లపై సీఐడీ నజర్?
– గౌరవరంలో భారీగా భూముల కొనుగోలు?
40 ఎకరాల భూమి మామ నుంచి గిఫ్ట్‌ డీడ్‌ ?
25 ఎకరాల భూమి పుల్లారెడ్డి కొనుగోలు?
– విచారణకు సిద్ధమవుతున్న బాబు సర్కారు

తెలంగాణకు చెందిన వాసుదేవ రెడ్డి రైల్వేలో ఐఆర్‌టీఎస్‌ అధికారి. అనంతపురం జిల్లా గుంతకల్లులో పనిచేస్తూ వైసీపీ నేతలతో సంబంధాలు పెంచుకున్నారు. జగన్‌ ఓఎ్‌సడీ కృష్ణమోహన్‌రెడ్డితో సాన్నిహిత్యం బాగా పెరిగింది. 2019లో ఏపీలో వైసీపీ అధికారంలోకి రాగానే ఏపీకి డిప్యుటేషన్‌పై వచ్చారు. ఆయనకు జగన్‌ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ అప్పగించారు.

ఎన్నికల సమయంలో వాసుదేవరెడ్డి వైసీపీ నేతలకు పూర్తిస్థాయిలో మద్యం అందుబాటులో ఉంచారు. డిపోల నుంచే ట్రక్కుల్లో రవాణా చేయించారు. దీనిపై ఎన్నికల కమిషన్‌కు ప్రతిపక్షాలు ఫిర్యాదు చేశాయి. దీంతో ఆయనను ఈసీ పదవి నుంచి తప్పించింది.

వాసుదేవరెడ్డి మామ మారెళ్ల పుల్లారెడ్డి. ఆయన… వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు వియ్యంకుడు. ఆయన స్వగ్రామమైన ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం గౌరవరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వాసుదేవ రెడ్డి అక్రమార్జనలో కొంత భాగం ఇక్కడ భూములపై పెట్టుబడి పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. 2022 సెప్టెంబరులో వాసుదేవరెడ్డి భారీగా భూములు కొన్నట్లు సమాచారం. సుమారు 40 ఎకరాల భూమిని తన మామ నుంచి గిఫ్ట్‌ డీడ్‌ రూపంలో పొందారు. ఆ తర్వాత 2023 ఏప్రిల్‌లో సుమారు 25 ఎకరాల భూమిని పుల్లారెడ్డి కొనుగోలు చేశారు. సీఐడీ దీనిపైనా దృష్టి సారించే అవకాశముంది.

LEAVE A RESPONSE