Suryaa.co.in

Andhra Pradesh

వివేకాను హత్యచేసిన వారితో పాటు,చేయించినవారు దోషులే

– సునీత వాంగ్మూలంలోచెప్పినదానిపై సీబీఐ దృష్టిపెట్టి, తక్షణమే జగన్మోహన్ రెడ్డిని ఏ1 గా అదుపులోకి తీసుకొని విచారించాలి.
• జగన్మోహన్ రెడ్డిని, ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలను సీబీఐ విచారిస్తేనే, వివేకాహత్యకేసు కొలిక్కి వస్తుంది.
• ప్రభుత్వవ్యతిరేక ఓటు చీలకూడదన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యల్లో తప్పేముంది?
• గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి చిరంజీవి ప్రభుత్వవ్యతిరేక ఓట్లు చీల్చడమే కారణమని పవన్ గ్రహించారు
– మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి

జగన్మోహన్ రెడ్డి పుణ్యమాఅని ఈ రాష్ట్రానికి కొత్తగా గొడ్డలి డే ఒకటి కొత్తగావచ్చిందని, వివేకానందరెడ్డి హత్యజరిగి, ఆయనగొడ్డలితో నరకబడి, నేటికి మూడేళ్లయిందని, ఈ ముఖ్యమంత్రి ఎంతటి మానవత్వంలేని మనిషో, దౌర్భాగ్యుడో ఇక్కడే అర్థమవుతోందని, తనతండ్రికి స్వయంగాతమ్ముడు, తనకు బాబాయ్ చనిపోయిన రోజున ఆయన చిత్రపటానికి నమస్కారం చేసే సమయంకూడా జగన్ రెడ్డికి లేకుండాపోయిందని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి బండారుసత్యనారాయణ మూర్తి ఆగ్రహం వ్యక్తంచేశారు.మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

వివేకాహత్యజరిగిన నాటినుంచీ నేటివరకు జగన్ రెడ్డి, ఆయన కుడి ఎడమ భుజాలుగా వ్యవహరించే, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఎలా మాట్లాడారో ఇప్పటికీప్రజలకు బాగానే గుర్తుంది. వివేకాహత్యజరిగి మూడేళ్లైనా ముఖ్యమంత్రి దానిపై ఎందుకు మాట్లాడటం లేదు.
ఎవరు చంపారో, ఎందుకు చంపారో ఎందుకు నోరుతెరవలేకపోతున్నాడు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబంలోని వారే ఆహత్యచేశారు. దానిపై మాట్లాడాల్సిన బాధ్యత అతని కే ఉంది. ప్రజలకు నమస్కారాలు పెడుతూ, బుగ్గలుగిల్లి, తలలునిమిరి వారిని మోసగించి, వారి ఓట్లుకొల్లగొట్టిన జగన్ రెడ్డి, బాబాయ్ ని చంద్రబాబు గారు, లోకేశ్ లే చంపించారంటూ తన అవినీతి మీడియాలో విషపురాతలు రాయించాడు.

వివేకానందరెడ్డి కుమార్తె సునీత, భార్య సౌభాగ్యమ్మ తమకు న్యాయంచేయండంటూ బోరునవిలపిస్తున్నా కూడా, జగన్ రెడ్డి మనసుకరగలేదు. తనతల్లి తరువాత తల్లైన ఆమె కన్నీళ్లకు కూడా ఈ ముఖ్యమంత్రి మనసు కరగలేదు. ఆఖరికి వివేకానందరెడ్డి హత్యను ఆయనకూతురు అల్లుడు, భార్యలకే ఆపాదించే దుస్థితికి జగన్ రెడ్డి దిగజారాడు.

వివేకానందరెడ్డిహత్యను తొలుత చంద్రబాబుకి అంటించాలని జగన్ రెడ్డి ప్రయత్నించాడు. తరువాత టీడీపీకి చెందిన ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవిలకు అంటగట్టాలని చూసి భంగప డ్డాడు. అదీకుదరకపోయే సరికి చివరకు బరితెగించి, వివేకాకుమార్తె, అల్లుడు, భార్యలను తన నీచరాజకీయాలకు బలిచేయాలనుకుంటున్నాడు. నిజంగా నీతిమాలిన జగన్ రెడ్డి చెప్పి నట్టు తనతండ్రిని తానే చంపించిఉంటే, వివేకాకుమార్తె సునీత ఢిల్లీ వెళ్లిమరీ సీబీఐ విచారణ ఎందుకు కోరుతుందో సమాధానంచెప్పు జగన్ రెడ్డి.

తనతండ్రి హత్యవ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి ప్రమేయఉందని వివేకాకుమార్తెకు బాగా తెలుసు. అందుకు అనేకఉదాహరణలు కారణాలుకూడా ఉన్నాయి. వివేకాహత్యకేసు విచార ణకు టీడీపీప్రభుత్వం నియమించిన సిట్ అధికారులను మార్చడం, సిట్ దర్యాప్తును అడ్డు కోవడంతోపాటు, హత్యకేసు విచారణను గతంలో సీబీఐకి అప్పగించాలంటూ తాను కోర్టులో వేసిన పిటిషన్ ను జగన్మోహన్ రెడ్డి ఉపసంహరించుకున్నాడు.

వివేకాహత్యతాలూకా విషయాలు, ప్రజలకు అసలువాస్తవాలు తెలియకూడదన్న ఉద్దేశంతో హైకోర్ట్ నుంచి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నావు. అవినాశ్ రెడ్డిని కాపాడటంకోసంఇప్పటికీ ఢిల్లీపెద్దలచుట్టూ తిరుగు తున్నావు. ఇలాంటి అనేకఘటనలు వివేకాహత్యోదంతంలో జగన్మోహన్ రెడ్డిపాత్రను, ప్రమే యాన్ని ఎత్తిచూపుతున్నాయి.

తనబాబాయ్ హత్య తాలూకా వాస్తవాలు, అసలుదోషులెవరో ప్రజలకు తెలియకూడదనే ముఖ్యమంత్రి ఇప్పటికీ తనప్రయత్నాలు తాను చేస్తూనేఉన్నాడు. సీబీఐకి తాను ఇచ్చిన వాంగ్మూలంలో వివేకాకుమార్తె ఎవరిమీద అయితే అనుమానం వ్యక్తంచేసిందో, వారినే సీబీఐ కూడా ప్రధానముద్దాయిలుగా తన ఛార్జ్ షీట్లో పేర్కొంది. వారిని కాపాడటానికి ఏకంగా జగన్ రెడ్డి తన అధికారాన్ని ఉపయోగిస్తున్నాడు.

ముఖ్యమంత్రి స్థానంలోఉన్న జగన్ రెడ్డి వివేకాహత్యపై నిజాయితీగా వ్యవహరించి ఉంటే, వివేకా కుమార్తె న్యాయంచేయాలని సీబీఐని , కేంద్రపెద్దలను కలవాల్సిన అవసరం ఏమిటి? తనప్రాణాలకు రక్షణ కావాలని ఆమెవాపోతే, ఈ ముఖ్యమంత్రి తనచెల్లికి రక్షణ కల్పించాలని తన కిందఉన్న పోలీస్ శాఖను ఎందుకు ఆదేశించలేకపోయాడు?

భారతదేశ చరిత్రలో సీబీఐ విచారణను వద్దనడం, విచారణాంశాలపై న్యాయస్థానాలను ఆశ్ర యించడం చూశాము. కానీ ఈ ముఖ్యమంత్రి ఏకంగా సీబీఐ అధికారులను బెదిరించే స్థాయి కి వెళ్లాడు. వివేకాహత్యకేసులో కీలకంగా వ్యవహరిస్తున్న సీబీఐ అధికారి రాంసింగ్ ను హతమార్చడానికి తనపార్టీవారే ప్రణాళికలు వేస్తున్నా జగన్ రెడ్డి ఎందుకుస్పందించలేదు?

రాజకీయం, ముఖ్యమంత్రి పీఠమే తనకుముఖ్యమని జగన్ రెడ్డి, సునీతతో మాట్లాడిన మాటలను బట్టే అర్థమవుతోంది.55వేల జనాభా ఉన్న జంగారెడ్డిగూడెంలో నాటుసారా ఎలా కాస్తారని ముఖ్యమంత్రి అసెంబ్లీలో అంటున్నాడు… మరి లక్షమంది వరకు ఉన్న పులి వెందులలో తనబాబాయ్ హత్య ఎలా జరిగిందో కూడా ఆయన చెప్పాలి?

సీబీఐ అధికారులు ఎంపీ అవినాశ్ రెడ్డికి నోటీసుల ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటే ఈ ప్రభుత్వం ఎందుకు అడ్డుపడుతోంది? ముఖ్యమంత్రి పోలీస్ అధికారులకు చెప్పి, సీబీఐ నోటీసులు అవి నాశ్ రెడ్డికి చేరేలా ఎందుకు చర్యలుతీసుకోలేకపోతున్నాడు?

జగన్మోహన్ రెడ్డి, ఆయన దొంగలముఠాలోని సభ్యులైన అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలాంటి వారంతా వివేకానందరెడ్డి చిత్రపటానికి ఎందుకు నివాళులు అర్పించలేదు? హత్యచేసిన వారు.. చేయించినవారు ఇద్దరూ సమానమేనని సీబీఐ గుర్తించాలి. సీబీఐ తక్షణమే జగన్మోహన్ రెడ్డిని ఏ1గా చేర్చి విచారణ చేపట్టాలి. అవినాశ్ రెడ్డిని, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని ఎందుకు విచారించడంలేదు?

కోవిడ్ తో చనిపోయాడని చెబుతున్న డాక్టర్ గంగిరెడ్డి కి చెందిన ఆసుపత్రి నుంచివచ్చిన కాంపౌండరే వివేకా మృతదేహానికి కుట్లువేశారు. కాబట్టి గంగిరెడ్డి మృతిపై కూడా సీబీఐవిచారణ చేయాలి. తాముపైన చెప్పినవారందరినీ తక్షణమే సీబీఐ అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. వివేకాకుమార్తె డాక్టర్ సునీత వాంగ్మూలంలోని ప్రతి అంశంపై సీబీఐదృష్టిపెట్టిలోతైన విచారణ జరిపించాలి.

హత్యకేసు విచారణలోఉన్న సీబీఐ అధికారులు ఈ ప్రభుత్వ బెదిరింపులకు, ముఖ్యమంత్రి అధికారానికి భయపడకుండా వారివిధిని వారు సక్రమంగా నిర్వహించాలని కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి మామగారు ఇప్పుడులేరు.. ఆయన కోవిడ్ తోనేనిజంగా చనిపోయాడా.. లేక ఎవరైనా చంపారా అనేదానిపై సీబీఐ ఆలోచనచేయాలికదా?మామైనా.. .తండ్రైనా….చిన్నాన్న అయినా జగన్మోహన్ రెడ్డిది ఎప్పుడూ ఒకటే ధ్యేయం. ఏదోఒకదాన్ని అడ్డంపెట్టుకొని ముఖ్యమంత్రికావాలి.. కేసులులేకుండా చేసుకోవాలి… అందిన కాడికి దోచుకోవాలి.. అదే ఆయన సిద్ధాంతం.

జగన్మోహన్ రెడ్డి అవినీతి, అరాచకపాలనపై, ఆయన చేసిన అప్పులపై, పవన్ కల్యాణ్ నిన్న ఆయనపార్టీ ఆవిర్భావసభలో మాట్లాడారు. అప్పులుచేస్తూ పోతే వాటిని ఎవరు తీరుస్తారని, ఆయన ప్రశ్నించారు. అరాచకపాలనకు తెరదించడంకోసం అన్నిపార్టీలు ఏకం కావాలని, అధికారంలోఉన్నవారికి అవకాశంలేకుండా చేయాలని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వవ్యతిరేక ఓటుచీలి జగన్మోహన్ రెడ్డికి మరలా ముఖ్యమంత్రి పీఠందక్కకూడదని పవన్ కల్యాణ్ అంటే ఆయనపై పడి వైసీపీవాళ్లు ఏడుస్తున్నారు?

చంద్రబాబుతో పవన్ కల్యాణ్ 2014లోనే కలిశారు. ఆయనకు మాపార్టీకి అభిప్రాయబేధాలు ఉన్నాయని మేం ఎప్పుడూ అనలేదుకదా! మంత్రి వెల్లంపిల్లికి రాజకీయభిక్ష పెట్టింది పవన్ కల్యాణ్ కుటుంబం కాదా? అలాంటి వెల్లంపిల్లి పవన్ కల్యాణ్ ని విమర్శిస్తే ఎలా? పవన్ కల్యాణ్ ప్రసంగం రాత్రి పూర్తైతే ,వైసీపీవారికి రాత్రంతా నిద్రేలేదు. తెల్లారీ ఆరకముందే ఆయనపై దుష్ప్రచారం చేయడానికి ఎగబడ్డారు.

LEAVE A RESPONSE