Suryaa.co.in

Telangana

బండి సంజయ్ ఓ లోఫర్

-సంజయ్ నత్తి నారాయణ లా మాట్లాడుతున్నారు
-మోడీ ఓ సారి 10 th వరకే చదువుకున్నా అన్నాడు.. మరో సారి మెకానికల్ ఇంజినీర్ అన్నాడు
-వందే భారత్ రైలు ను ప్రధాని ఎన్ని సార్లు ప్రారంభిస్తారు?
-సంజయ్ నాలుకను ప్రజలే చీరుస్తారు
-బ్రోకర్లు, జోకర్లు, పాగల్ గాళ్ల పార్టీ బీజేపీ
-శివరాజ్ సింగ్ చౌహన్ రాజీనామా చేశారా?
-రాజ్ దీప్ సర్దేశాయ్ ఏమైనా జడ్జీ యా, రాజ్యాంగమా?
-బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, గాదరి కిశోర్ కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్

ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఏమన్నారంటే..
బండి సంజయ్ ఓ లోఫర్ గాడిలా మాట్లాడుతున్నారు.బండి సంజయ్ నత్తి నారాయణ లా మాట్లాడుతున్నారు.బీ ఆర్ ఎస్ కు ఎదో నిర్వచనం చెబుతున్నారు.మేము కూడా బీజేపీ గురించి చాలా చెప్పగలం.బండి సంజయ్ తన తండ్రి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో టీచర్ అని చెప్పారు. మోడీ చదువు గురించి నిజాలు చెప్పమంటున్నాం.. తప్పేముంది? మోడీ ఓ సారి 10 th వరకే చదువుకున్నా అన్నాడు.. మరో సారి మెకానికల్ ఇంజినీర్ అన్నాడు. ఏది నిజమో తెలవాలి.అమిత్ షా మోడీ సర్టిఫికెట్ లు చూయించారు గతం లో..ఇపుడు అవి నకీలివీ అని చూయించడం లేదా?పేపర్ లీకేజీ లు బీజేపీ కుట్రే అని క్రమంగా అర్థమవుతోంది.కేసీఆర్ ను విమర్శిస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్టే.

సంజయ్ లాంటి అర్హత లెనోడికి స్థాయి కి మించిన పదవి వస్తే ఇలానే ఉంటుంది.వందే భారత్ రైలు ను ప్రధాని ఎన్ని సార్లు ప్రారంభిస్తారు.సంజయ్ లాంగ్ మార్చ్ చేస్తే ఢిల్లీ లో చేయాలి.రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన వాటి పై ఢిల్లీ లో లాంగ్ మార్చ్ చేయాలి.సంజయ్ ఎంపీ గా తెలంగాణ గురించి పార్లమెంటు లో నోరు విప్పారా?తెలంగాణ సంజయ్ జాగీరు మోడీ జాగీరు కాదు.ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే సంజయ్ నాలుకను ప్రజలే చీరుస్తారు. కేసీఆర్ తెలంగాణ జాతి పిత..ktr, కవిత లు పులి బిడ్డలు.. బీజేపీ బెదిరింపులకు భయపడరు.ktr, కవిత లు మోడీ లాగా పారాచుట్ నేతలు కారు.బ్రోకర్లు, జోకర్లు, పాగల్ గాళ్ల పార్టీ బీజేపీ.సంజయ్ తంబాకు మాటలు బంద్ చేయాలి.సంజయ్ తెలంగాణ లో ప్రశాంత వాతావరణం చెడగొట్టాలని చూస్తున్నారు.ప్రజలకు ఓపిక నశిస్తే బండి సంజయ్ ను ఉరికించి కొడుతారు. మోడీ అన్నిటిని ఎడపెడా పెంచేస్తున్నారు.ఉన్న ఉద్యోగాలు కేంద్రం ఊడగొడుతోంది.బండి తస్మాత్ జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకో.జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్ వ్యాఖ్యల గురించి మాట్లాడుతున్నారు.ఆయన ఏమైనా జడ్జీ యా, రాజ్యాంగమా?

ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏమన్నారంటే..
బీజేపీ అంటే భారతీయ జూటా పార్టీ.. దానికి బండి జూటా అధ్యక్షుడు.బండి సంజయ్ కు పిచ్చి కుక్క కరిచినట్టుంది.. పిచ్చిగా మాట్లాడుతున్నాడు.ప్రాణాలు కాపాడే మందుల పై కేంద్రం పన్నులు వేయడం దుర్మార్గం.శవాల మీద పేలాలు ఎరుకునే రకం బీజేపీ నేతలు.బీజేపీ కి చిల్లర దిగజారుడు రాజకీయాలు చేసే అలవాటు.మతం పేరు మీద రాజకీయాలు చేసే పార్టీ బీజేపీ. పొద్దున లేస్తే కేసీఆర్ కుటుంబం మీద పడి ఏడవడం తప్ప బండి కి ఏది చేత కాదు.ఏ అంశం మీద నైనా బీజేపీ మేధావులు కేసీఆర్ తో చర్చ కు రావచ్చు..కేసీఆర్ ఏ అంశం లో నైనా ఆ చర్చ లోతప్పు మాట్లాడితే నేను ఎమ్మెల్యే పదవి కి రాజీనామా చేస్తా. బండి సంజయ్ అబద్దాలతోనే పుట్టినట్టున్నారు.దేశం భవిష్యత్ గురించి కేసీఆర్ ఆందోళన తో ఉన్నారు.మోడీ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ సర్వ నాశనం అయ్యింది.సీబీఐ కేసులు ఎన్ని పెడుతున్నారు.. ఎన్ని నిరూపిత మవుతున్నాయ్?అలాంటి సీబీఐ కి మోడీ కితాబు ఇస్తారా?మధ్యప్రదేశ్ లో వ్యాపం కుంభ కోణం పెద్దది.. అక్కడ శివరాజ్ సింగ్ చౌహన్ రాజీనామా చేశారా? ఎక్కడ ఏదీ జరిగినా కేసీఆర్ కుటుంబానికే అంటగడుతున్నారు.బండి సంజయ్ ఏది పడితే అది మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయి.

ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఏమన్నారంటే..
బీ ఆర్ ఎస్ పుట్టగానే బీజేపీ వెన్నులో వణుకు పుట్టింది.తెలంగాణ కు ఏం ఇచ్చారని మోడీ సహా బీజేపీ అగ్ర నేతలు హైదరాబాద్ కు వస్తున్నారు?వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధించాలి అని గతం లో అసెంబ్లీ లో తీర్మానం చేశాము.. దానిపై ఈ నెల 8న మోడీ సమాధానం చెప్పాలి.మోడీ తన చదువు మీద వస్తున్న ఆరోపణల పై స్వయంగా హైదరాబాద్ సభ లో స్పష్టం చేయాలి.తెలంగాణ కు బీజేపీ పనికొచ్చే పని బీజేపీ ఒక్కటైనా చేసిందా?తెలంగాణ అభివృద్ధి ఎజెండా ఏమిటో బీజేపీ చెప్పాలి.తెలంగాణ హక్కులను కాలరాచిన పార్టీ బీజేపీ. బండి బట్టేబాజ్ మాటలు మానాలి.కేసీఆర్ అంటే బీజేపీ అగ్రనేతలకు ఇంత భయం ఎందుకు? శంషాబాద్ ఎయిర్ పోర్టు లో రోజూ దిగుతున్న బీజేపీ నేతలు తెలంగాణ కు ఏం తెస్తున్నారు.పేపర్ లీకేజీ ల పై బీజేపీ నేతల కుట్రలు త్వరలోనే బయటకు వస్తాయి. బీజేపీ వ్యూహాలను ఎదిరించే శక్తి ఒక్క కేసీఆర్ కే ఉంది.

LEAVE A RESPONSE