ఏపీ రాజకీయాల్లోకి బండి సంజయ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. జగన్ ప్రభుత్వంపై అమీతుమీకి బీజేపీ సిద్ధమైంది.ఈ నెల 21న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో, బండి సంజయ్ అమరావతికి రానున్నారు. ఆయన సేవలను ఏపీలో మరింత వాడుకోవాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది. ఏపీలో ఓటరు నమోదు ప్రక్రియను బండి సంజయ్ సమీక్షించనున్నారు.
అలాగే తెలంగాణ తోపాటు ఏపీ , మహారాష్ట్ర, గోవా, ఒడిషా ఐదు రాష్ట్రాల బాధ్యతలు ఇచ్చే అవకాశముందని భావిస్తున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత బండి సంజయ్ ఈ నెల 21న విజయవాడలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు హీటెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బండి సంజయ్‌ను తెలంగాణ అధ్యక్షుడిగా మార్చిన తర్వాత బీజేపీ అధిష్టానం ఆయనకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి కల్పించింది. ఈ నేపథ్యంలో బండి సేవలను తెలంగాణతోపాటు ఏపీలో కూడా ఉపయోగించు కోవాలని హైకమాండ్ నిర్ణయించింది.మొదటిసారిగా బండి సంజయ్ ఏపీకి వెళుతున్న నేపథ్యంలో రాజకీయంగా ఆసక్తి నెలకొంది.