అధికారం అప్పగిస్తే ధర్నాలు చేయడానికి సిగ్గులేదూ?

– టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్

కేంద్రంలో బిజెపి పార్టీకి, రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేసి పూర్తిస్థాయి అధికారాన్ని కట్టబెడితే పరిపాలన చేతకాక ధర్నాలు చేయడం ఇరు పార్టీల స్వార్థపూరిత అవగాహనా రాహిత్యానికి నిదర్శనం.

ప్రజల రక్తం పీల్చి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు వసూలు చేస్తూ అదే కాక కేంద్రం రాష్ట్రం పోటీపడి గ్యాస్ ,పెట్రోల్ ,డీజిల్ రాష్ట్రం విద్యుత్ చార్జీలను పోటీపడి సామాన్యులపై మోయలేని భారాన్ని పెంచాయి. దీని వల్ల ప్రతి వస్తువు పై ధరలు పెరిగి సామాన్య మధ్యతరగతి ప్రజలు విలవిలలాడుతున్నారు. ప్రజలకు మేలు చేస్తామని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేయకపోగా వారి నిర్ణయాలు గుదిబండగా తయారయ్యాయి.

రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉండగా వాటిని విస్మరించి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రాజకీయం చేస్తున్నారు. కొత్త సినిమాల స్పెషల్ టికెట్ రేట్లు పెంచే ప్రభుత్వాలు ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పంటలను కొనడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు.

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు భేషజాలకు పోకుండా సంయుక్తంగా రైతులకు భరోసా కల్పించాలని డిమాండ్ చేస్తున్నా. మీకు అధికారం ఇస్తే పరిపాలించకుండా రోడ్లపై ధర్నాకు దిగుతున్నారు కదా. అదే రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పి గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నారు. తక్షణమే కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పన్ను తగ్గించాలని కోరుతున్న.

Leave a Reply