Suryaa.co.in

Andhra Pradesh

క్యాన్సర్ వ్యాధి పట్ల అప్రమత్తంగా వుండండి

– ప్రాధమిక దశలో గుర్తిస్తే క్యాన్సర్ కు చికిత్స వుంది
– ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలను సద్వినియోగం చేసుకోండి
– మరో ఆరు నెలల్లో రెండో దశ క్యాన్సర్ స్క్రీనింగ్స్ నిర్వహిస్తాం
– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

కోవూరును క్యాన్సర్ రహిత నియోజకవర్గంగా చేయాలన్నదే తన సంకల్పమన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . ఆ లక్ష్య సాధనలో భాగంగానే కనీస వైద్య సదుపాయాలు లేని మారుమూల గ్రామీణ ప్రాంతాలలో అత్యాధునిక క్యాన్సర్ స్క్రీనింగ్స్ చేస్తున్నట్టు ఆమె తెలిపారు. విడవలూరు మండల కేంద్రంలో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ సహకారంతో నిర్వహిస్తున్న క్యాన్సర్ స్క్రీనింగ్స్ ఆమె పర్వేక్షించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రాధమిక దశలో గుర్తించి సకాలంలో వైద్య చికిత్సలు చేయించుకుంటే క్యాన్సర్ నియంత్రించ వచ్చన్నారు. ఇప్పటికే కోవూరు నియోజకవర్గంలో కోవూరు, ఇందుకూరుపేట, బుచ్చి, కొడవలూరు మండలాలలో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ నిర్వహించామని విడవలూరు మరో నాలుగైదు రోజుల పాటు క్యాన్సర్ స్క్రీనింగ్ జరుగుతాయన్నారు.

గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించి క్యాన్సర్ స్క్రీనింగ్స్ చేయించడంలో కోవూరు నియోజకవర్గ పరిధిలోని ఆరోగ్య కార్యకర్తల కృషి అభినందనీయమన్నారు. భయాందోళనలు వీడి 35 ఏళ్ళు పై బడ్డ ప్రతి మహిళ ఏ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్యాన్సర్ ఉన్నట్టు నిర్ధారణ అయితే తిరుపతిలోని స్విమ్స్ హాస్పిటల్ లో ఉచిత వైద్య సేవలు పొందొచ్చన్నారు. క్యాన్సర్ పరీక్షలు చేసే ప్రక్రియలో తమ సంపూర్ణ సహకారమందిస్తున్న స్విమ్స్ వైద్యులు మరియు టెక్నికల్‌ సిబ్బందికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్విమ్స్ హాస్పిటల్ కు చెందిన ఆంకాలజిస్ట్ డాక్టర్ హరిత, బెజవాడ వంశీ కృష్ణా రెడ్డి, అడపాల శ్రీధర్ రెడ్డ్, వినీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE