Suryaa.co.in

Andhra Pradesh

ఆర్టీసీ నూతన బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యానందరావు

రావులపాలెం బస్ డిపోలో రోడ్డు రవాణా సంస్థ నూతనంగా ఏర్పాటు చేసిన బస్సును కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు,జనసేన ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ లు ప్రారంభించారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా రవాణాకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకునేందుకు రోడ్డు రవాణా సంస్థపై ప్రత్యేక దృష్టి సారించింది.

ఈ క్రమంలో కొన్ని నూతన బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చిందని వాటి సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.అదే విధంగా ప్రయాణికుల ఇక్కట్లు తీర్చేందుకు రోడ్లపై గుంతలు పూడ్చేందుకు కొత్త కార్యక్రమం ప్రభుత్వం చేపట్టనుందని తెలిపారు. ఇందుకోసం 860 కోట్ల రూపాయలు వ్యయం ఖర్చు పెట్టనున్నట్లు సత్యానందరావు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ,కె వి సత్యనారాయణ రెడ్డి, గుత్తుల పట్టాభి రామయ్య,చిలువూరి సతీష్ రాజు,పాలూరి సత్యానందం, తోట స్వామి, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE