Suryaa.co.in

Political News

వంగవీటి రంగా హత్య వెనుక…

– రంగా ఎన్టీఆర్ అభిమానా?
సొంత పార్టీ వారే ద్రోహం చేశారా?
విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రతిపక్ష నాయకుడి మీద హత్య ప్రయత్నం జరిగింది…
అంటే నమ్మాము.
ప్రతిపక్ష నాయకుడి సొంత బాబాయి హత్య అధికారంలో ఉన్న వారి సహకారంతోనే జరిగింది…..
అంటే నమ్మాం.
కానీ ఎన్నికల అయిపోయి…. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత… పై రెండు సంఘటనలలో అప్పటి పాలకులు పాత్ర లేదని… కాలం నిరూపించింది.
సరిగ్గా అలాంటిదే, 1988 డిసెంబర్ 26న జరిగిన వంగవీటి మోహన రంగా హత్య.
అప్పటి ప్రభుత్వంలోని పెద్దలు, ఒక కులం రంగా ని దారుణంగా చంపేయని… ఒక తరం(30 సంవత్సరాలు) పాటు నమ్మించారు.
కానీ…
కోస్తా జిల్లాలలో, ఎన్నికలలో కులాల ప్రభావం… అనే అంశం మీద… ఇటీవల నేను చేస్తున్న పరిశోధనలో… అర్ధమైన కొన్ని అంశాలు……
1. విజయవాడలో వంగవీటి రంగా-దేవినేని నెహ్రూ ముఠాల మధ్య జరిగిన ఘర్షణలు… రెండు కులాల గొడవలు కావు.
2. రంగా మరియు నెహ్రూ కుటుంబాలు చాలాకాలం అత్యంత ఆత్మీయంగా ఉన్నాయి.
3. చలసాని వెంకటరత్నం హత్యలో కులాల గొడవలు లేవు
4. రాధా హత్య తర్వాత కూడా కులాల గొడవలు లేవు.
5. కాపు కులస్తులు అయిన వంగవీటి రంగా- కమ్మ కులానికి చెందిన చెన్నుపాటి
రత్నకుమారి పెళ్లి సమయంలోనూ కులాల గొడవలు లేవు.
6. దేవినేని గాంధీ హత్య తర్వాత… ఇరువర్గాలు వేరయ్యారు తప్ప… కులాల గొడవలు లేవు.
7. వంగవీటి రంగా ఎన్టీఆర్ కి వీరాభిమాని అని, తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు, విజయవాడలో ఎన్టీఆర్ కి ఆహ్వానం పలికి, తెలుగుదేశం పార్టీలో చేరడానికి వంగవీటి రంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడని, అయితే దానికి కొద్దిరోజుల ముందే దేవినేని నెహ్రూ తెలుగుదేశంలో చేరడం వల్ల, రంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగాడు అని… చాలా మందికి తెలియదు.
8. తన చుట్టూ ఉన్న ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ వర్గాల అభివృద్ధి కోసం పని చేసే క్రమంలో… రంగా ప్రాబల్యం ఇతర జిల్లాలో కూడా విస్తరించడం, 1985 ఎన్నికలలో ఎన్టీఆర్ ప్రభంజనం లో కూడా విజయవాడ తూర్పు లో రంగా ఎమ్మెల్యే కావడం కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి కలలుకంటున్న నాయకులకు, కంటి మీద కునుకు లేకుండా చేయడం.
9. లక్షలాది జనంతో ఖమ్మం కాలేజ్ గ్రౌండ్ లో జరిగిన ఇందిరాగాంధీ సభ రికార్డ్ బ్రేక్ చేసిన ఎన్టీఆర్ సభకు రెట్టింపు జనం వంగవీటి రంగా సభకు రావడం (రంగ ఆఖరి పబ్లిక్ మీటింగ్),
తాను జైల్లో ఉండి కూడా, దాదాపు పది లక్షల మందితో చారిత్రాత్మక కాపునాడు సభను విజయవాడలో నిర్వహించడం…… అవి చూసిన సొంత పార్టీలో నాయకుడే… రంగా తనను దాటి పోతున్నాడని అంచనాకు రావడం……
10. కొంతమంది ఆరోపించినట్లు, రంగా హత్య వెనుక తెలుగుదేశం పార్టీ ఉంటే… రంగా భార్య కొద్ది సంవత్సరాలలోనే తెలుగుదేశం పార్టీలో ఎందుకు చేరతారు?
11. దేవినేని నెహ్రూ చేత తెలుగుదేశం పార్టీ రంగాను హత్య చేయిస్తే…..
కొద్ది సంవత్సరాల తర్వాత దేవినేని నెహ్రూ రాజశేఖర్ రెడ్డికి ఎలా సన్నిహితుడు అవుతాడు?
12. ప్రత్యర్థులపై దాడికి కత్తులు మాత్రమే వాడే బెజవాడ రౌడీయిజం చరిత్ర లో……. రంగా హత్య సమయంలో… బాంబులు వేసింది ఎవరు???
13. అంటే వంగవీటి రంగాను హత్య చేయించి….. దానిని తెలుగుదేశం మరియు కమ్మ కులం ఖాతాలో వేసి……. చరిత్రను దారి మళ్ళించింది ఎవరు???
వాస్తవానికి….
1970 దశకం నుండి వంగవీటి రంగా జరిగిన రోజు వరకు…… విజయవాడలో జరిగినవి కమ్మ- కాపు గొడవలు కావు. రెండు ముఠాలకు ఘర్షణలు. అధిపత్యం కోసం జరిగిన హత్యలు.
మరి కమ్మ- కాపు గొడవలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి???
పథకం ప్రకారం…
రంగా ను చంపిన తర్వాత…..
విజయవాడ నగరంలో….
కొంతమంది కమ్మ కులస్తులను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేసి…. వాటిని కాపుల ఖాతాల్లో వేశారు.
చూసేవాళ్లకు కూడా…. ఇవి కమ్మ- కాపు గొడవలు అని నమ్మకం కలిగే విధంగా… వ్యవహారం నడిపించారు.
కానీ….
చరిత్ర త్రవ్వకాల్లో… ఏదో ఒక రోజు… నిజాలు బయటకు వస్తాయి.
కనీసం అప్పుడైనా అర్థం అవుతుందా?
అసలు సూత్రధారి ఎవరో?????

– డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు

LEAVE A RESPONSE