Home » తాలిబన్లతో తస్మాత్ జాగ్రత్త!

తాలిబన్లతో తస్మాత్ జాగ్రత్త!

– ప్రపంచం మొత్తం ఆలోచించాల్సిన సమయమిది
ఇప్పుడు పార్టీలు, కులాలు-మతాల కన్నా దేశం గురించి అంతా కలసి, పనిచేయాల్సిన సమయం. దేశం కన్నా మనకు పార్టీలు-కులాలు-మతాలు గొప్పవి కాదు. ప్రపంచం మొత్తం ఆలోచించాల్సిన పరిస్థితి. నర రాక్షస హంతకులు అధికారంలోకి వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ దేశంలో, తాలిబన్ లు ఏ విధమైన పోకడలు పోతున్నారో చూస్తున్నాం.వాళ్ల క్యాబినెట్ లో, అత్యంత తీవ్రమైన హంతకులకు- తీవ్రవాదులకు పెద్ద పదవులు ఇచ్చారు. ఆ క్యాబినెట్ నిర్మాణంలో, పూర్తిగా పాకిస్తాన్, చైనా తదితర దేశాల పెత్తనం ఉన్నట్టుగా స్పష్టంగా అర్థం అవుతుంది. తీవ్రవాద ముఠాలు ఐ ఎస్ ఐ ,ఆల్ ఖైదా, జిహాదీ,ప్రపంచ తీవ్రవాద ముఠాలు, జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, అమెరికా ఎవరిని పట్టిస్తే వారికి 74 కోట్లు బహుమానం ఇస్తామని ప్రకటన చేసిన రాక్షసులు, ఈ క్యాబినెట్ లో హోంమంత్రి సిరాజుద్దీన్ హక్కానీ లాంటివారు ఉన్నారు.
వీరివల్ల ఆ దేశంలో వారు ఎంత అరాచక స్థితి అనుభవిస్తూన్నారో, ఎన్ని కష్టాలను ఎదుర్కొంటున్నారో .. అంతకంటే ఎక్కువ కష్టాలు ఎక్కువ ఇబ్బందులు, బాధలు ఇతర దేశాల పడాల్సి వస్తుంది. ముఖ్యంగా భారతదేశం చాలా అప్రమత్తంగా ఉండాలి. కచ్చితంగా మొదటి టార్గెట్ మన దేశం అవుతుంద ని, ప్రపంచ మేధావులు ఊహిస్తున్నారు చెబుతున్నారు.వీరి వెనుక ఉన్న దేశాలు చైనా కమ్యూనిస్టు దేశం, పాకిస్తాన్ తీవ్రవాద దేశం. ఇవి రెండూ కూడా మనదేశానికి బద్ధ వ్యతిరేకులే, శత్రువులే , విషం కక్కే వే .మన దేశం విడిపోవాలని దేశం ముక్కలు కావాలని, అల్లర్లు జరగాలని ఏదో ఒక రకంగా అలజడులు సృష్టించి .. దేశాన్ని ఇబ్బంది పెట్టాలని ఆఫ్ఘనిస్తాన్ను ప్రోత్సహించి, పీఓకే లో స్థావరాలు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తారు. అక్టోబర్ ,నవంబర్ మాసాలు వారికి కలిసి వస్తాయి.
ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్, మాదక ద్రవ్యాల వ్యాపారం మీద ఆధారపడుతుంది . వారి దేశంలో అది ఎక్కువగా పండుతుంది. దానిని ఇతర దేశాలకు ఎగుమతి చేసే మాఫియా వారి పబ్బం గడుపుకోవడం, డబ్బు సంపాదించు కోవడం, తద్వారా ఇతర దేశాలాలో ఉండే యువతను నిర్వీర్యం చేయడం ద్వారా ఆ దేశాలు బలహీనపడతాయని ఆ దేశాల ముఖ్య ఉద్దేశం.గతంలో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ను పరిపాలన చేసినప్పుడు, వారు ప్రపంచ దేశాల గురించి ఆలోచించేవారు కాదు. ప్రస్తుతం వారి ఆలోచన ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని గురించి కూడా ప్రపంచం చెప్పుకోవాలి అనే కోరిక కలిగింది. తీవ్రవాదం ద్వారానే రాజ్యాన్ని పరిపాలించాలని కాంక్ష కలిగిన ,విషం కక్కే రాక్షస ముఠా అది .
ఈ పరిస్థితుల్లో ఈ రాక్షస ముఠా పీచమణిచే యడం, ఒక్క భారత దేశం వలనే అవుతుందని ప్రపంచ దేశాలు నమ్ముతున్నాయి. ఈ మధ్య సంబంధిత మంత్రులతో ,అధికారులతో, అజిత్ దోవల్ తో ఇతర దేశ అధికారులు మాట్లాడి పోయిన విషయం మనం చూశాం . ఈ స్థితిలో మనం చాలా జాగరూకతతో… దేశ నాయకత్వానికి అండదండలు అన్ని రకాలుగా అందిస్తూ ,ఎటువంటి చర్యలు తీసుకున్నా..రాజకీయాలకు పోయి, నాయకత్వాన్ని ఇష్టప్రకారం డిబేట్, ,వ్యాసంగాల ద్వారా పలచన కాకుండా .. చేయకుండా .. దేశ నాయకత్వానికి అండదండగా మన వంతు కృషి మనం చేద్దాం.

– పెంజర్ల మహేందర్ రెడ్డి
ఓసి సంఘం జాతీయ అధ్యక్షుడు
9666606695

Leave a Reply