Home » ప్రత్యేక ప్యాకేజీతో ‘భారత్‌ గౌరవ్‌’ రైలు

ప్రత్యేక ప్యాకేజీతో ‘భారత్‌ గౌరవ్‌’ రైలు

జూన్‌ 7వ తేదీన చెన్నైలో బయలుదేరి 19న తిరుగు ప్రయాణం

విజయవాడ, నేపాల్, ముక్తినాథ్, దివ్య దేశం యాత్ర ప్రత్యేక ప్యాకేజీతో ‘భారత్‌ గౌరవ్‌’ రైలును నడపనున్నారు. జూన్‌ 7వ తేదీన చెన్నైలో బయలుదేరి 19న తిరుగు ప్రయాణం అవుతుంది. విజయవాడ డివిజన్‌ పరిధిలోని గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, గుంటూరు, మిర్యాలగుడ, సికింద్రాబాద్, ఖాజీపేట మీదగా నైమిశారణ్యం, ముక్తినాథ్, ఖడ్మండు, పశుపతినాథ్, అయోధ్య తదితర ప్రాంతాలకు చేరుతుంది. టీ, టిఫిన్, భోజనం, హోటల్‌ గదులు, రవాణాతో కలిపి టికెట్‌ ఒక్కొక్కరికీ సెకెండ్‌ ఏసీలో రూ.59,950, థర్డ్‌ ఏసీలో రూ.54,900, స్లీపర్‌ తరగతిలో రూ.45,900 ఉంటుంది. టికెట్ల బుకింగ్‌ ఇతర వివరాలకు 93550 21516 నంబరులో సంప్రదించవచ్చని రైల్వే అధికారులు తెలిపారు.

Leave a Reply