తండ్రి, సోద‌రుడికి భ‌ట్టి నివాళీ

-స్నానాల ల‌క్ష్మి పురంలోని వ్య‌వ‌సాయ కేత్రంలో
-మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ది కార్యాక్ర‌మాల‌పై స‌మీక్ష‌

ప్ర‌ముఖ ఆయుర్వేద వైద్యులు స్వ‌ర్గీయ మ‌ల్లు అఖిలాండ దాసు, పిసిసి మాజీ అధ్య‌క్షులు, కేంద్ర మాజీ మంత్రి మ‌ల్లు అనంత‌రాములు వ‌ర్ధంతి సంద‌ర్భంగా బుద‌వారం రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భట్టి విక్రమార్క దంప‌తులు ఘ‌నంగా నివాళీలు అర్పించారు.

ఖ‌మ్మం జిల్లా వైర మండ‌లం స్నానాల ల‌క్ష్మిపురంలోని వ్య‌వ‌సాయ క్షేత్రం వ‌ద్ద భ‌ట్టి విక్రమార్క తండ్రి అఖిలాండ దాసు, సోద‌రుడు మ‌ల్లు ఆనంత‌రాములు గార‌ల‌ స‌మాధుల‌ను సంద‌ర్శించి పుష్ప‌గుచ్ఛాలు సమ‌ర్పించి నివాళీలు అర్పించారు. స్థానిక కాంగ్రెస్ శ్రేణులు, స్థానికి ప్ర‌జా ప్ర‌తినిధులు మ‌ల్లు ఆనంత‌రాములు అమ‌ర్ హై అంటూ నిన‌దించారు. త‌దుప‌రి ల‌క్ష్మిపురం నుంచి మండ‌ల కేంద్ర‌మైన‌ వైర వ‌ర‌కు ఉన్న మ‌ట్టి రోడ్డును ప‌రిశీలించారు.

అక్క‌డ‌నే మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి ప‌నుల ప్ర‌గ‌తిపై వివిధ శాఖ‌ల అధికారుల‌తో స‌మీక్షించి జిల్లా అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. దీనికి ముందు స్థానిక శివాల‌యంలో భ‌ట్టి దంపతులు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. వీరికి పూర్ణ‌కుంభంతో ఆల‌య పండితులు స్వాగ‌తం ప‌లికారు.

స్వామి అమ్మ‌వార్ల వ‌ద్ద ప్ర‌త్యేక అర్చ‌న‌లు జ‌రిపి వేద ఆశీర్వ‌చ‌నం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో వైర ఎమ్మెల్యే రామ‌దాసు నాయ‌క్‌, ఖ‌మ్మం డిసిసి అధ్య‌క్షులు పువ్వాళ్ల దుర్గ‌ప్ర‌సాద్‌, వైర కాంగ్రెస్ మండ‌ల అధ్య‌క్షులు శీలం వెంక‌ట న‌ర్సిరెడ్డి త‌దిత‌ర కాంగ్రెస్ నాయ‌కులు పాల్గొన్నారు.

Leave a Reply