రామకృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన భట్టి

కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచ పట్టణంలో నాగ రామకృష్ణ కుటుంబం ఇంట్లో గ్యాస్ఓపెన్ చేసుకొని అగ్నికి అహుతి అయినా విషయం విదితమే ఘటనలో మృతుడి కూతురు ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాహితిని పరామర్శించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.

ఎమ్మెల్యే కుమారుడు వనమా రాఘవేంద్రరావు బెదిరింపులు తట్టుకోలేక రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకుందని.ఫలితంగా సాహితీ తల్లీ తండ్రులును, తన అక్క ను కోల్పోయి అనాధగా అయినదని..ఇలాంటి ఘోరం దేశం లో మరెక్కడా జరగకూడదని భట్టి బాధను వెళ్లబుచ్చారు. ఈ ఘటనను కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ శాసనసభపక్షాన ఖండిస్తున్నట్లు తెలిపారు.

90 శాతం కాలిన గాయాలతో మరో బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. బాలిక కు మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నాం అన్నారు. ఈ ఘటన చూసి మనసున్న ప్రతీ ఒక్కరు చలించి పోతున్నారు.
వనమా రాఘవ మొదటినుండి దౌర్జన్యాలు, ఆగడాలు, సెటిల్మెంట్లు చేస్తూ ఉన్న పోలీసులు చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ ఘటన చోటుచేసుకుంది అని భట్టి ఆరోపించారు.

అధికార పార్టీకి ప్రభుత్వ యంత్రాంగం వత్తాసు పలకడం వల్లనే ఇలాంటి ఘటనలు వనమా రాఘవపై గతంలోనూ అనేక ఆరోపణలు ఉన్నా పోలీసులు చర్యలు తీసుకోకపోవడం మే కాకుండా ఆయన కు భజన పరులుగా మారడం తో నే, రాఘవ రోజు రోజుకు ఆగడాలు శృతి మించి ప్రజలు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడని… ఇకనైనా పోలీసులు అధికార పార్టీ కి వత్తాసు పలకటం మాని…ధోషి అయినా ఎమ్మెల్యే తనయుడు వనమా రాఘవేంద్రకు శిక్ష పడేలా చూడాలని పోలీస్ అధికారులను కోరారు. వనమా రాఘవపై గతంలో ఉన్న పిర్యాదులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని భట్టి డిమాండ్ చేశారు.

Leave a Reply