ఎమ్మెల్సీగా భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి విజయం

– పశ్చిమ రాయలసీమ పట్టభద్ర నియోజకవర్గం (కడప – అనంతపురము – కర్నూలు) ఎమ్మెల్సీగా భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి విజయం
– వెన్నపూస రవీంద్ర రెడ్డిపై 7543 ఓట్ల తేడాతో భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గెలుపు

పశ్చిమ రాయలసీమ పట్టభద్ర నియోజక వర్గం (కడప – అనంతపురము – కర్నూలు) ఎమ్మెల్సీగా భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి విజయం సాధించారు. అనంతపురము నగరంలోని జేఎన్టీయూ కళాశాలలో పశ్చిమ రాయలసీమ పట్టభద్ర నియోజకవర్గం (కడప – అనంతపురము – కర్నూలు) ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో భాగంగా గురువారం ఉదయం 08:00 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టగా, శనివారం రాత్రి 08:00 గంటల వరకు నిర్వహించారు.

మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఏ అభ్యర్థికి సరైన మెజార్టీ దక్కకపోగా, అనంతరం ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టి 7543 ఓట్ల తేడాతో భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గెలిచినట్లుగా రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ప్రకటించారు.

ఈ కౌంటింగ్ లో భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి 1,09,781 ఓట్లు రాగా, వెన్నపూస రవీంద్ర రెడ్డికి 1,02,238 ఓట్లు వచ్చాయని తెలిపారు. అధికారికంగా ఎన్నికల కమిషన్ అనుమతి పొందిన అనంతరం భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గెలుపుని ప్రకటించడం జరుగుతుందని రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ తెలిపారు.