స్వచ్ఛమైన పరిపాలన అంటే దోచిపెట్టడమా?

– ఎపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు

వ్యవసాయ ఆధారితంగా మన దేశంలో వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిన బిజెపి ప్రభుత్వం వాటిని అమలుచేయడానికి ముందుకు రాలేకపోయిందని ఎపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు విమర్శించారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో ఈరోజు (14-03-2023) ఉదయం జరిగిన పత్రికా సమావేశంలో మాట్లాడిన ఆయన గౌతమ్ అదానీ కి కట్టబెడుతున్న దేశ సంపదలను, పోర్టులు, స్టీల్ ప్లాంట్, ఎయిర్ పోర్ట్ లు, పవర్ ప్రాజెక్ట్ లు, అంబానీ, ఆదానీలకు ధారాదత్తం చేస్తున్నారని దేశ ప్రజలు గుర్తించి వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బిజెపి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. ప్రపంచంలో 16 వ స్థానంలో వున్నా గౌతమ్ అదానీ రెండవ స్థానంలోకి చేరారంటే ప్రధాని నరేంద్ర మోడీ కారకులని ఆరోపించారు.

GVK, GMR బ్రహ్మాండమైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రజలను సౌకర్యవంతమైన ఏర్పాట్లను చూస్తున్నారని వారిని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధిని నీరుకారుస్తూ, కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని, మార్గదర్శి సంస్థపై దాడులు వీటికి నిదర్శనమని గిడుగు రుద్రరాజు అన్నారు. అవినీతి, అక్రమాలు, కక్ష సాధింపు చర్యలకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి నిధులు కేటాయించాలి.

అప్పటి ముఖ్యమంత్రి డా.వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి నాలుగు వేల కోట్ల రూపాయలు ఎడమ, కుడి కాలువలకు నిధులు మంజూరు చేసారని గుర్తుచేశారు. ప్రత్యేకహోదా విషయంలో ప్రధానిని ఎన్నిసార్లు కలిశారు, ఎన్నిసార్లు రాష్ట్రము గురించి మాట్లాడారు అన్న విషయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. అప్పటి యూపీఏ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ పోలవరం అథారిటీ ఏర్పాటు చేసి నిపుణులతో కమిటీ వేయించారు.

తెలుగువారు అన్నిరంగాలలోను ప్రపంచ స్థాయిలో పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టినారని ప్రశంసిస్తూ, కీరవాణి, చంద్రబోస్ లకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. పత్రిక సమావేశంలో రుద్రరాజుతో పాటుగా కార్యనిర్వాహక అధ్యక్షులు సుంకర పద్మశ్రీ, ఏఐసిసి సభ్యులు కొలనుకొండ శివాజీ, విజయవాడ నగర అధ్యక్షులు, ఏఐసిసి సభ్యులు నరహరశెట్టి నరసింహ రావు, ప్రధాన కార్యదర్శి చేవూరు శ్రీధర్ రెడ్డి, ఏఐసిసి సభ్యులు మేడా సురేష్ పాల్గొన్నారు.