కార్యకర్త కుటుంబాన్ని చూసి చలించిపోయిన భువనమ్మ

• కుప్పం నియోజకవర్గం, గుడిపల్లి మండలం, కొడతనపల్లిలో చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మృతిచెందిన పార్టీ కార్యకర్త వెంకటేష్(34) ఇంటికి వెళ్లిన భువనమ్మ.
• వృద్దాప్యంలో ఉన్న వెంకటేష్ తల్లిదండ్రులు, చిన్న వయస్సులో భర్తను కోల్పోయిన వెంకటేష్ భార్య, ఎదగాల్సిన వయస్సులో తండ్రిని కోల్పోయిన ముగ్గురు చిన్నారులను చూసి చలించిపోయిన భువనమ్మ.
• వెంకటేష్ భార్య సౌమ్య(30), కుమారులు తులసీరామ్(7), మోక్షిత్(5), మౌర్య(3) లను చూసి చలించిపోయిన భువనమ్మ.
• వెంకటేష్ భార్య, పిల్లలు, తల్లిదండ్రుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న భువనమ్మ.
• వెంకటేష్ ముగ్గురు పిల్లలను చదివించేందుకు పూర్తి బాధ్యతలు తీసుకున్న భువనమ్మ.
• వెంకటేష్ కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉండాలని స్థానిక పార్టీ నాయకులు, ఎమ్మెల్సీ శ్రీకాంత్ కు సూచించిన భువనమ్మ.
• భువనమ్మ తమ ఇంటికి రావడం, తమ యోగక్షేమాలడిగి తెలుసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన వెంకటేష్ కుటుంబ సభ్యులు.

Leave a Reply