Suryaa.co.in

Telangana

ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు చుక్కెదురు

– 20 వరకు కవితకు జ్యుడీషియల్ కస్టడీ

ఢిల్లీ: ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో కోర్టులో దర్యాప్తు సంస్థలు హాజరుపరిచాయి. ఈ కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించి కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని ఈడీ, సీబీఐ అధికారులు కోరారు. దీంతో ఈ నెల 20 వరకు కవితకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది.

వారం రోజుల్లో కవితపై చార్జ్‌షీట్‌ను దాఖలు చేస్తామని కోర్టుకు ఈడీ అధికారులు వెల్లడించారు. జైలులో కవిత చదవడానికి 10 పుస్తకాలు అనుమతించాలని కోర్టును ఆమె న్యాయవాది నితీష్ రానా కోరారు. కోర్టులో కవితను 15 నిమిషాల పాటు కలిసిసేందుకు కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలని కోర్టును న్యాయవాది కోరారు.

ప్రజ్వల్ రేవన్నను దేశం దాటించారు: కవిత
రౌస్ అవెన్యూ కోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు.. ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రజ్వల్ రేవన్న లాంటి వాళ్లను విడిచిపెట్టి, దేశం దాటించి నాలాంటి వాళ్లను అరెస్ట్ చేశారు. ఇది అన్యాయం, ఈ విషయాన్ని అందరూ గమనించాలి’’ అని కవిత వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE