పోరాడినోళ్లంతా బీజేపీకే మద్దతు: కిషన్ రెడ్డి

టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హుజురాబాద్ ప్రజలను అధికార పార్టీ అనేక ప్రలోభాలకు గురి చేస్తోందని ఆయన అన్నారు. హుజూరాబాద్ ఎన్నికలకు సంబంధించి కిషన్ రెడ్డి హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్లో ప్రెస్‎మీట్ ఏర్పాటుచేశారు.
‘తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోంది. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు బీజేపీ వైపు ఉన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో మద్యం, డబ్బు ఏరులై పారుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వారంతా ఇప్పుడు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీపై ప్రజలలో వ్యతిరేకత ఎదురవుతోంది. టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయని పక్షంలో ప్రజా సంక్షేమ పథకాలు నిలిపి వేస్తామని టీఆర్ఎస్ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోంది. నోరుంది కదా అని తప్పుడు ప్రచారాలు చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. మార్పు కోసం హుజురాబాద్ ప్రజలు బీజేపీ పార్టీకి ఓటు వేయనున్నారు. హుజూరాబాద్ ప్రచారంలో నిన్న జరిగిన దాడిని తీవ్రంగా ఖండింస్తున్నాను. హుజురాబాద్ ఎన్నికల్లో ఈటల రాజేందర్ తప్పకుండా గెలుస్తారు. హుజూరాబాద్‎కు కేంద్ర ప్రభుత్వ బలగాలు పంపాలని మేమే కోరాం. హుజురాబాద్ ఎన్నికలను ప్రశాంతంగా జరిపించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‎ను కోరుతున్నాను. టీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకుంది. హుజూరాబాద్‎కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన ఇంకా ఖరారు కాలేదు’ అని కిషన్ రెడ్డి తెలిపారు.

Leave a Reply