కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు హరీష్‌రావు బహిరంగ లేఖ

హుజురాబాద్: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్‌కు మంత్రి హరీష్‌రావు బహిరంగ లేఖ రాశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ధర్నాలు చేస్తున్న రైతులను ఉగ్రవాదులుగా పోల్చారని మండిపడ్డారు. రైతులని చంపిన వారిపై ఇంత వరకు కేసు నమోదు చేయలేదని తప్పుబట్టారు. ‘‘కిషన్ రెడ్డి, సంజయ్ మీకెందుకు ఓటెయ్యాలి. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినందుకు ఓటు వెయ్యాలా. ధాన్యం కొనుగోళ్లు చెయ్యమని చెప్పినందుకు ఓటెయ్యాలా. తెలంగాణలోని ఒక్క ప్రాజెక్ట్‌కి కూడా జాతీయ స్థాయి హోదా ఇవ్వలేదు. కృష్ణా నది నీళ్లను ఏపీ తీసుకుంటుంటే బీజేపీ స్పందించట్లేదు. లేఖరాసి తప్పు చేశామని మాజీమంత్రి ఈటల రాజేందర్ దళితులకు క్షమాపణ చెప్పాలి’’ అని హరీష్‌రావు డిమాండ్ చేశారు