Suryaa.co.in

Andhra Pradesh

బిర్సా ముండా గొప్ప జాతీయ వాది

– బిజెపి కార్యాలయ కార్యదర్శి పవన్ జీ పవన్ జీ

అమరావతి: జాతీయ ఉద్య‌మంపై ఎన‌లేని ప్ర‌భావం చూపించాడు బిర్సా ముండా అని బిజెపి కార్యాలయ కార్యదర్శి పవన్ జీ పేర్కొన్నారు.
బిజెపి రాష్ట్ర కార్యాలయం లో జరిగిన బిర్సా ముండా వర్థంతి కార్యక్రమం లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈసందర్భంగా పవన్ జీ మాట్లాడుతూ ఆయ‌న పుట్టిన రోజుకు గుర్తుగా 2000వ సంవ‌త్స‌రంలో జార్ఖండ్ రాష్ట్రం ఏర్ప‌డింది. త‌న జీవిత కాలమంతా ఆదివాసీల బాగు కోసం ప‌రిత‌పించిన యోధుడు బిర్సా ముండా.

కోట్లాది ప్ర‌జ‌లు తనను ఆరాధ్య దైవంగా కొలుస్తారు. ఈ భూమి ప‌విత్ర‌మైన‌ద‌ని, ఇది అడ‌వి బిడ్డ‌ల‌కు మాత్ర‌మే చెందింద‌ని నిన‌దించాడు బిర్సా ముండా. 1900 ఫిబ్రవరి 3న జంకోపాయి అటవీప్రాంతంలో బిర్సాముండాను అరెస్టు చేసి రాంచీ జైలుకు తరలించారు.

ఎప్పటికైనా తమకు ప్రమాదకారిగా మారతాడని భావించిన బ్రిటిష్ ప్రభుత్వం బిర్సాముండాను 1900 జూన్ 9న విష ప్రయోగంతో చంపేసింది. బయటకు మాత్రం మలేరియాతో మరణించాడు అంటూ ప్రచారం చేసింది. ఆ పోరాట వీరుడికి మ‌ర‌ణం లేదు. యావ‌త్ దేశం బిర్సా ముండాకు స‌లాం చేస్తోంది. గిరిజ‌న బిడ్డ‌లు స్మ‌రించుకుంటున్నారు. ఇప్పటికీ ఆయన్ని జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ఆదివాసీలు ‘భగవాన్ బిర్సాముండా’గా పూజిస్తున్నారు. చనిపోయేటప్పుడు బిర్సాకు కేవలం 25 ఏళ్లు మాత్రమే.

LEAVE A RESPONSE