Suryaa.co.in

Telangana

తెలంగాణ రాష్ట్రంలో గందరగోళం, రాజకీయ అస్థిరత కు బీజేపీ కుట్ర

-రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసేందుకు, మత తత్వ బీజాలు నాటుతున్న బీజేపీ నాయకులు
-అప్పటి వాజ్ పాయ్, అద్వానీ బీజేపీ కాదు ఇది… కుట్రలు, కుతంత్రాల బీజేపీ రాజ్యమేలుతోంది ఇప్పుడు
-పెండింగ్ లో ఉన్న 14 జాతీయ రహదారుల సంగతేంటి..?
-సూత్రప్రాయంగా అంగీకరించి ఎందుకు మంజూరు చేయట్లేదు..?
-కొత్త జిల్లాలకు నవోదయ విద్యాలయాలు ఎందుకు ఇవ్వడం లేదు..?
-తెలంగాణ రాష్ట్రం పట్ల ఎందుకింత వివక్ష..?
-ప్రధాని నరేంద్ర మోడీని సూటిగా ప్రశ్నించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
-రాష్ట్ర పర్యటనలో ఈ అంశాలపై స్పష్టత ఇవ్వాలని ప్రధాని మోడీని డిమాండ్ చేసిన వినోద్ కుమార్

తెలంగాణ రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొల్పేందుకు, రాజకీయంగా అస్థిరతను సృష్టించేందుకు, రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసేందుకు, యువతలో మతతత్వ బీజాలు నాటేందుకు బిజెపి కేంద్ర, రాష్ట్ర నాయకులు కుట్రలు పన్నుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వినోద్ కుమార్ మాట్లాడారు.

అప్పటి అటల్ బిహారీ వాజ్పాయ్, లాల్ కృష్ణ అద్వానీ బిజెపి కాదు అని, ఇప్పుడు ఉన్నది కుట్రలు, కుతంత్రాల బిజెపి మాత్రమే అని వినోద్ కుమార్ విమర్శించారు.ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, బీజేపీ దేశంలో చిచ్చు రేపుతోంది అని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చెబుతున్నట్లుగా ఏంపవరింగ్ తెలంగాణ కాదు అని, డి – స్టాబులైజేశన్ తెలంగాణ అని వినోద్ కుమార్ అన్నారు.
రాష్ట్రానికి రావాల్సిన 14 జాతీయ రహదారుల మంజూరు అంశం గత ఐదారేల్లుగా కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్నాయని, సూత్రప్రాయంగా అంగీకరించిన ఈ జాతీయ రహదారులను రాష్ట్ర పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. జాతీయ రహదారుల విషయంలో గానీ, రాష్ట్రంలోని కొత్త జిల్లాలకు నవోదయ విద్యాలయాలు మంజూరు చేసే విషయంలో గానీ తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్షత చూపుతోందని వినోద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన జాతీయ రహదారులను మంజూరు చేయకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోందని వినోద్ కుమార్ అన్నారు.

చౌటుప్పల్ (ఎన్ హెచ్ 65) – ఆమంగల్ – షాద్ నగర్ – సంగారెడ్డి మధ్య 182 కిలో మీటర్ల జాతీయ రహదారిని, కరీంనగర్ ( ఎన్.హెచ్. 563 జంక్షన్ ) – సిరిసిల్ల – కామారెడ్డి – ఎల్లారెడ్డి – పిట్లం ( ఎన్.హెచ్. 161 జంక్షన్ ) మధ్య 165 కిలో మీటర్లు, వనపర్తి – కొత్తకోట – గద్వాల్ – మంత్రాలయం ( ఎన్.హెచ్. 167 మధ్య 110 కిలో మీటర్లు, ఎర్రవల్లి చౌరస్తా – గద్వాల్ – రాయచూర్ మధ్య 67 కిలో మీటర్లు, మన్నేగూడ – వికారాబాద్ – తాండూర్ – జహీరాబాద్ – బీదర్ మధ్య 133 కిలో మీటర్లు, మరికల్ – నారాయణ్ పేట – రామ్ సముద్ర మధ్య 63 కిలో మీటర్లు, జగిత్యాల – పెద్దపల్లి – కాల్వ శ్రీరాంపూర్ – కిష్టంపేట – రామప్ప టెంపుల్ – జంగాలపల్లి మధ్య 164 కిలోమీటర్లు, సారపాక – ఏటూరునాగారం మధ్య 93 కిలోమీటర్లు, పుల్లూరు – అల్లంపూర్ – జెట్ ఫ్లోర్ – పెంట్లవెల్లి – కొల్లాపూర్ – లింగాల్ – అచ్చంపేట – దిండి – దేవరకొండ – మల్లేపల్లి – నల్గొండ మధ్య 225 కిలోమీటర్లు, దుద్దెడ -కొమురవెల్లి -యాదగిరిగుట్ట – రాయగిరి క్రాస్ రోడ్ మధ్య 63 కిలోమీటర్లు, జగ్గయ్యపేట – వైరా – కొత్తగూడెం మధ్య 100 కిలోమీటర్లు, సిరిసిల్ల – వేములవాడ – కోరుట్ల మధ్య 65 కిలోమీటర్లు, భూత్పూర్ నాగర్ కర్నూల్ మన్ననూరు మద్దిమడుగు గంగలకుంట సిరిగిరిపాడు మధ్య 165 కిలోమీటర్లు కరీంనగర్ రాయపట్నం మధ్య 60 కిలోమీటర్లు మొత్తం కలిపి 1656 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి మంజూరు పనులు కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్ లోనే ఉందని వినోద్ కుమార్ వివరించారు.

జిల్లాకు ఒక నవోదయ విద్యాలయాలు మంజూరు చేయరా?
జిల్లాకు ఒక నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు తెలంగాణ రాష్ట్రంలోని కొత్త జిల్లాలకు నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో కేవలం 9 నవోదయ విద్యాలయాలు మాత్రమే ఉన్నాయని, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన 33 జిల్లాల్లో, కొత్త 24 జిల్లాల్లో నవోదయ విద్యాలయాల ఏర్పాటు అత్యంత ఆవశ్యక అవశ్యకత ఉందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున నవోదయ విద్యాలయాలలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రధానమంత్రి కి కేంద్ర విద్యా శాఖ మంత్రి కి లేఖలు రాశారని, తాను కూడా కరీంనగర్ ఎంపీ హోదాలో జిల్లాకు ఒక నవోదయ విద్యాలయాల కోసం పార్లమెంట్ లో డిమాండ్ చేశానని వినోద్ కుమార్ గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నీ విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేసే సంప్రదాయాన్ని 1985 నుంచి కొనసాగిస్తుందని వినోద్ కుమార్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని విడనాడి తెలంగాణ రాష్ట్రానికి 24 నవోదయ విద్యాలయం విద్యాలయాలను మంజూరు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ వస్తున్న సందర్భంలో ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రైల్వే లైన్లు ఇవ్వాలని, కాజీపేట లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE