ఎస్సీ వర్గీకరణ పేరుతో బీజేపీ చిచ్చు

మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య

మాలల సమకాలీన సమస్యలు, భవిష్యత్‌ కార్యాచరణపై గురువారం సంగారెడ్డి అంబేద్కర్‌ భవన్‌లో మాల మహానాడు మాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగిం ది. ముఖ్యఅతిథి మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిద్దామని, ఎస్సీ వర్గీకరణ పేరుతో కులాల మధ్య బీజేపీ చిచ్చు పెడుతోందన్నారు. మాలలపై రాజకీయ పార్టీలు విషం చిమ్ముతున్నాయని, మాలలను అణగదొక్కే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మాలలను చిన్నచూపు చూస్తున్న పార్టీలకు పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. వర్గీకరణ సమస్యలతో మాలలు వెనుకబడు తున్నారని, వారు అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది రాజకీయంగా ఎదగాలన్నారు. ఈ సదస్సులో మాల సంఘాల జేఏసీ వర్కింగ్‌ చైర్మన్‌ గోపోజి రమేష్‌, రాష్ట్ర అధ్యక్షుడు మన్నె శ్రీధర్‌రావు జిల్లా అధ్యక్షుడు జనార్ధన్‌, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బక్కయ్య, నాయకులు అనంతయ్య, రత్నంరాజు వెంకటేశ్వర్లు, ఆంజనేయులు, మధుసూదన్‌, సదానందం, దేవయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply