Suryaa.co.in

Andhra Pradesh

సర్వేపల్లిలో వైసీపీ ఖాళీ

-సోమిరెడ్డికి మద్దతుగా వెల్లువలా వలసలు
-ఓటమి భయంలో మంత్రి కాకాణి

సర్వేపల్లి నియోజకవర్గంలో అధికార పార్టీ ఖాళీ అవుతోంది. నియోజకవర్గంలోని అన్ని మండ లాల్లో పెద్దఎత్తున ఆ పార్టీని వీడి టీడీపీ బాట పట్టారు. వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్థన్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది. తోటపల్లిగూడూరు మండలం వరిగొం డ బిట్‌ -2కు చెందిన 40 కుటుంబాల వారు వైసీపీని వీడి సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సమక్షంలో చేరారు. చేరిన వారిలో జానా జగదీష్‌, వైసీపీ 11వ వార్డ్‌ సభ్యుడు విశ్వనాధుల రమణయ్య, అడ్డూరి హరికృష్ణ, కటకం శీనయ్య, కంచి శేఖర్‌, కామూరు సురేష్‌, నాలంగి లీలాకుమార్‌, హరికృష్ణ, చక్రి, శీనయ్య, చిన్ని గీషా ఉన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సాన్నారెడ్డి సురేష్‌రెడ్డి, కోడూరు శ్రీనివాసులురెడ్డి, కర్పూరపు శ్రీనివాసులురెడ్డి, జానా శ్రీనివాసులు పాల్గొన్నారు.

పొదలకూరు: అమ్మవారిపాలెం గ్రామం నుంచి వైసీపీని వీడి సోమిరెడ్డి సమక్షంలో 18 కుటుం బాల వారు టీడీపీలో చేరారు. వారికి తిరుపతి పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్థి వరప్రసాద్‌, సోమిరెడ్డి శృతిరెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అద్దంకి గిరి నాయుడు ఆధ్వర్యంలో ఎంపీటీసీ కొమ్మి అరుణమ్మ, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ కొమ్మి వెంకట సుబ్బానాయుడు, మాజీ వైసీపీ వార్డు సభ్యుడు వేటూరి ఆనంద్‌ చేరిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తలచీరు మస్తాన్‌బాబు, గుదే రామకృష్ణ, అద్దంకి తిరుపతినాయుడు, అద్దంకి శ్రీహరినాయుడు అద్దంకి రమేష్‌నాయుడు, గంటా రామలక్ష్మణులు, రావులపల్లి సురేష్‌, మద్దినేని పూర్ణచంద్ర, వడ్లమూడి రమేష్‌, వడ్లమూడి వెంకటేశ్వర్లు, మరుపూరు రఘు తదితరులు పాల్గొన్నారు.

ముత్తుకూరు: పైనాపురం పంచాయతీ దళితవాడకు చెందిన 24 కుటుంబాలు సోమిరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. చేరిన వారిలో మూడవ వార్డు సభ్యురాలు జె.సుగుణమ్మ, సర్వే పల్లి అంబేద్కర్‌ ఇండియా మిషన్‌ కార్యదర్శి అనిల్‌కుమార్‌, వైసీపీ గృహ సారథి రమేష్‌, రమణ య్య, మస్తాన్‌, విజయ్‌, సిసింద్రీ, ప్రవీణ్‌, సతీష్‌, ఏడుకొండలు, రత్నం, నరసింహం, తదితరులు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పల్లంరెడ్డి రామ్మోహన్‌రెడ్డి, తోటపల్లి గూడూరు మండల పార్టీ అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్‌రెడ్డి, షఫీ ఉల్లా, రాజేష్‌, గ్రామ నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE