– రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్: బీజేపీ పార్టీ బీసీ ల వ్యతిరేకి అని మరోసారి నిరూపించుకుంది. ముగ్గురు బీసీ ఎంపీలు ఉన్న , బీసీ సీనియర్ నేతలు ఉన్న బీజేపీ అధ్యక్షుడు కావడానికి అన్ని అర్హతలు ఉన్న ఇవ్వలేదు. గతంలో బీసీ ముఖ్యమంత్రి చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి కనీసం సభాపక్ష నాయకుడుని కూడా బీసీ లకు ఇవ్వలేదు.
బీజేపీ ఫ్యూడల్ పార్టీ.. బీజేపీ లో బీసీ లకు ఎప్పుడూ న్యాయం జరగలేదు. బీజేపీ అధ్యక్ష పదవి కోసం ఒక బీసీ నాయకుడు నామినేషన్ వేయనివకుండా అడ్డుకొని నిరంకుశత్వంగా వ్యవహరించారు. ఆయన మద్దతుదారులను భయబ్రాంతులకు గురి చేశారు.
బీజేపీ లో బీసీ లకు అన్యాయం జరుగుతుందని మీ పార్టీ నాయకులే వాపోతున్నారు. దీనికి బీజేపీ అధిష్టానం ఏం సమాధానం చెప్తుంది. సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం. బీసీ ల ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి రెడ్డి ఉంటే… పీసీసీ అధ్యక్షుడిని బీసీ నీ చేసుకున్నాం.
మేము ఒకవైపు కుల గణన చేసుకొని బీసీ లకు రాజకీయ విద్యా ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు చేస్తూ శాసన సభలో చట్టం చేసుకొని సామాజిక న్యాయం కోసం ముందుకు పోతుంటే..బీజేపీ మరోసారి బీసీల గొంతు కోసింది.
దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ బీసీల కోసం నినాదాన్ని ఎత్తుకున్నారు. తెలంగాణ లో దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ లకు న్యాయం జరిగేది కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం. గతంలో బీజేపీ అధ్యక్షుడు బీసీ నేత బండి సంజయ్ ఉంటే, ఎన్నికల సమయంలో ఆయనను తొలగించి కిషన్ రెడ్డిని అధ్యక్షుడిని చేశారు.