Suryaa.co.in

Andhra Pradesh

వరధ బాదితులకు బీజేపీ అండ

విజయవాడ: వరదల్లో ఇబ్బంది పడుతున్న అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీ వాసులకు బిజెపి ఆధ్వర్యంలో బట్టలు పంపిణీ నిర్వహించారు.అమెరికా దేశం లో కాలిఫోర్నియా లో స్థిరపడిన అమర్నాథ్ రెడ్డి విజయవాడ లో వరద బాధితుల కోసం సహకారం అందించాలని నిర్ణయించారు.

ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ సూచనలు మేరకు అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీ వాసులకు.. చీర, లుంగీ, టవల్, దుప్పటి లతో కూడిన 200 కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీ రాం మాట్లాడుతూ వరద వల్ల సర్వం కోల్పోయారు.దాతల దాతృత్వం తో కొంత ఉపశమనం కలిగించే విధంగా సహకారం చేస్తున్నాం అన్నారు. అమర్నాథ్ రెడ్డి, మధుకర్ జీ చేతులు మీదుగా కిట్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు ఉప్పలపాటి శ్రీనివాస్ రాజు, మువ్వల వెంకట సుబ్బయ్య,కిలారు దిలీప్, బొమ్మ దేవర రత్న కుమారి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE