Suryaa.co.in

Andhra Pradesh

జేఆర్ సిల్క్ శారీస్ విరాళం 15 లక్షలు

విజయవాడ: వరద విలయానికి అతలాకుతలమైన విజయవాడ ప్రజలకు చేయూత ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన జేఆర్ సిల్క్ శారీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత జింకా రామాంజనేయులు రూ.15 లక్షలు విరాళంగా అందచేశారు.

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ సమక్షంలో రామాంజనేయులు మంగళవారం విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి చెక్కును అందజేశారు. కష్టాల్లో ఉన్న సాటివారికి సాయం చేయడానికి ముందుకొచ్చిన రామాంజనేయులును సీఎం చంద్రబాబు, మంత్రి సత్యకుమార్ అభినందించారు.

రామాంజనేయులును ఆదర్శంగా తీసుకుని వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు

LEAVE A RESPONSE