ప్రాంతీయ పార్టీలు వస్తే నియంతలే గద్దెనెక్కుతారు

– నేను ఎవరు విడిచిన బాణం కాదు
– తెలంగాణలో నియంతను గద్ద దింపే దాకా విశ్రమించలేదు
– బిజెపి టిడిపి వైసిపి కుమ్మక్కు రాజకీయాలు
-ఏపీ సి సి చీఫ్ షర్మిల

విజయవాడ: 175 స్థానాలు, 25ఎంపీ స్థానాలలో కాంగ్రెస్ పోటీ చేస్తుంది.23నుండి అన్ని జిల్లాల పర్యటన జరుగుతుంది.9 రోజులు రోజుకి మూడు జిల్లాల్లో పార్టీలో చేరికలు ఉంటాయి. 24 నుండి పోటీ చేసే అభ్యర్థుల నుండి అప్లికేషన్లు తీసుకుంటాము.

మణిపూర్ లో సంఘటనలు వలన దేశానికీ బీజేపీ అవసరం లేదు.పోలవరం, అమరావతి రాజధాని, వైజాగ్ స్టిల్ ప్లాంట్ లాంటి అన్ని విషయాల్లో ఏపీకీ బీజేపీ అన్యాయం చేసింది.వైసీపీ, టీడీపీ రెండు బీజేపీతో కుమ్మక్కు అయ్యారు.రాష్టంలో 25 మంది ఎంపీలు బీజేపీ.

రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాక ఏపీకీ ప్రత్యేకహోదా ఇస్తాము.ఆంధ్రప్రదేశ్ ప్రజలు నాకు ముఖ్యం.నేను ఎవరు వదిలిన బాణం కాదు.మహిళ కదా అని తక్కువ చేసీ మాట్లాడద్దు.

తెలంగాణలో ఒక నియంతను అధికారం నుండి దించాను. ఆంధ్రప్రదేశ్ పుట్టిన ఇల్లు. తెలంగాణ మెట్టిన ఇళ్ళు. ఏపార్టీకి నష్టం జరుగుతుందో ప్రజలే చెబుతారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డ తెలంగాణలో ఒక నియంతను గద్దె దింపింది.

నేను నా స్వార్ధం చూసుకోలేదు.తెలుగు ప్రజలు బాగుండాలి కాబట్టే నేను కాంగ్రెస్ లో చేరా.రీజనల్ పార్టీ నేతలు అధికారంలోకి వస్తే నియంతలే అవుతారని చరిత్ర చెబుతోంది. ఎవరికి ఎక్కువ భయం ఉంటే వారే నన్ను విమర్శిస్తారు.

Leave a Reply