Home » బద్వేల్ లో బీజేపీ పోటీ ఖాయం: సోము వీర్రాజు

బద్వేల్ లో బీజేపీ పోటీ ఖాయం: సోము వీర్రాజు

ఉప ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థి బరిలో నిలుస్తారని ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. కేంద్ర నాయకత్వం నుండి కూడా పోటీకి గ్రీన్ సిగ్నల్ వచ్చిందన్నారు. మిత్రపక్షమైన జనసేన పోటీ చేయమని కోరాం అని అయితే వారు సొంత ఎజెండాతో పోటీ నుండి తప్పుకున్నారు అన్నారు. అందుకే బీజేపీ పోటీ చేస్తుందని చెప్పారు. జనసేన మద్దతు కోరతామన్నారు. ఈ మేరకు సోమవారం గుంటూరులోని ఐటీసీ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
జనసేన పోటీ నుండి తప్పుకున్నప్పుడు మీకు ఎలా మద్దతిస్తుంది అన్న ప్రశ్నకు సోము వీర్రాజు పవన్ కళ్యాణ్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. జనసేన బిజెపికి దూరమై టిడిపి కి దగ్గరవుతుంది అన్న ప్రశ్నకు పార్టీ అంతర్గత వ్యవహారం అని దాటవేశారు. ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీ కి తేడా ఉంటుంది అన్నారు. మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను మీరు ఖండించారా?. అని అడగా అందరం ఖండించాలి. రాజకీయాల్లో గౌరవప్రదంగా విమర్శలు చేసుకోవాలన్నారు. కులాలను, మతాలను, అపవాదించి సమస్యలను పక్కదారి పట్టించ కూడా దన్నారు. బిజెపి జనసేన కలిసి ఉంటాయని స్పష్టం చేశారు. రెండు పార్టీల మధ్య నిధాన పరమైన అంశాలు వుంటే కూర్చొని మాట్లాడుకుంటాం అన్నారు.
రాష్ట్రంలో వైసీపీ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు అవినీతి అక్రమాలతో ప్రజలు విసిగిపోయారు అన్నారు. దేశంలో మోడీ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారన్నారు. రాష్ట్రంలో జరిగిన ప్రతి అభివృద్ధిలో కేంద్ర నిధులు భాగస్వామ్యం ఉందని చెప్పారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పథకాలను వినియోగించుకుంటూ ప్రధాని మోడీనీ విస్మరిస్తన్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం యూనిట్ ధర 2 రూపాయలతో కరెంట్ ఇస్తుంటే రాష్ట్రంలో యూనిట్ ధర ఎనిమిది రూపాయలు చేసి పేద ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆరోపించారు ప్రజలు బీజేపీని ఆదరించాలని కోరారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మాట్లాడుతూ..రాజకీయాల్లో ఉంటే సంపాదించాలి అనే ఆలోచనకు అతీతంగా ఉండాలి. రాజకీయాలంటే సేవ అనే భావంతో ఉండాలి. బిజెపి ఆ దిశగానే కార్యకర్తలను తయారు చేస్తోంది. రాష్ట్రంలో ప్రతి ఇంటికి త్రాగునీటి కనెక్షన్ కోసం కేంద్రం మూడు వేల కోట్ల నిధులిచ్చింది. రాష్ట్రంలో 2014 నుండి ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇస్తున్నారు.చంద్రబాబు రాజధాని కడతామన్నారు. కట్టలేదు. మోడీ ఎయిమ్స్ కడతామన్నారు కట్టారు.
అమరావతి అనంతపురం హైవే ఏర్పాటు చేస్తున్నాం. రెండు డిఫెన్స్ ప్రాజెక్టులను కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు. బద్వేలులో రెండు జాతీయ రహదారులు వేశాం.
సంక్షేమం కేవలం జగనే కాదు మీము కూడా చేస్తున్నాం. రైతుకు ఆరు వేల ఇస్తున్నాం.
అభివృద్ధి, సంక్షేమం మోడీ సొత్తు. రాష్ట్రంలో వివిధ రైల్వే ప్రాజెక్టుల్లో రాష్ట్రం తన వాటా నిధులివ్వలేదు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది మోడీ ఒక్కడే. బిజెపి జాతీయ పార్టీ బద్వేలులో పోటీ చేస్తాం.
కుటుంబ పార్టీలను నిరోధించే పార్టీ. మా మిత్ర పక్షం తన అభిప్రాయాన్ని చెప్పింది.
ఎన్నికలు తర్వాత రెండు పార్టీల మధ్య పొత్తు కొనసాగుతోంది. తిరుపతిలో పోటీ చేస్తారు. జిల్లా పరిషత్ ల్లో పోటీ చేయరు.. బద్వేలులో పోటీ చేస్తాం. జేఎస్పీ కూడా మద్దతిస్తుందన్న ఆశావహంతో ఉన్నాం.ఈ సందర్భంగా ఐటీసీ హాల్లో ఏర్పాటుచేసిన ప్రధాని నరేంద్ర మోడీ జీవిత విశేషాల ఫోటో గ్యాలరీ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. కరోనాపై అవగాహన కల్పించే స్వీయరక్షణ కరపత్రాన్ని విడుదల చేశారు. కలెక్టరేట్ ఎదురు ఉన్న పోస్ట్ ఆఫీస్ లో ఉచిత వ్యాక్సిన్ పంపిణీ చేసిన ప్రధానికి పోస్ట్ కార్డు ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీనివాస రావు పేటలో ఉచిత వ్యాక్సినేషన్ సెంటర్ ను సందర్శించారు. అనంతరం బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నివాసానికి వెళ్లి, ఆయనతో మర్యాదపూర్వకంగా కలుసుకొని పార్టీ కార్యక్రమాలపై సోము వీర్రాజు చర్చించారు.
ఈ కార్యకమాలలో బిజెపి జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ, బిజెపి రాష్ట్ర నాయకులు రావెల కిషోర్ బాబు, యడ్లపాటి రఘునాదబాబు,సురేంద్ర రెడ్డి జూపూడిరంగరాజు,శనక్కాయలఅరుణ,చందు సాంబశివరావు, రమాకుమారి,బిట్ర శివన్నారాయణ,తోట రామకృష్ణ,తాళ్ల వెంకటేష్ యాదవ్,డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్, పాలపాటిరవికుమార్,వనమానరేంద్ర,రాచుమల్లు భాస్కర్,కుమార్ గౌడ్,అప్పిశెట్టి రంగారావు,గారపాటి పూర్ణ,నీలం ప్రసాద్,మైలా హరికృష్ణ,అనుమోలు ఏడుకొండలు గౌడ్,ఉయ్యాల శ్యామవరప్రసాద్, బుజ్జిబాబు,ఎస్ ఎం. భాష, నమ్రత చౌదరి, పద్మనాభం,దారా అంబేద్కర్,మల్లాల లక్ష్మణ్,శేషగిరి,హరీష్, నాగిరెడ్డి,బిజెపి మహిళా మోర్చా నాయకులు బొల్లాప్రగడ శ్రీదేవి, యామిని శర్మ, కర్రి నాగలక్ష్మి,నాగమల్లేశ్వరి,హరి పావని,రేణుకా దేవి,రమాదేవి, ఏలూరిలక్ష్మీ ,మేరీ సరోజిని, ఆదిలక్ష్మీ పాల్గొన్నారు.

Leave a Reply