లక్షలకోట్ల విలువైన ఎయిడెడ్ విద్యాసంస్థల ఆస్తులను కొట్టేయడానికే

Spread the love

-టీడీపీ ఎమ్మెల్సీ ,ద్వారపురెడ్డి జగదీశ్ 
లక్షలకోట్ల ఆస్తులున్నాయన్న కారణంతోనే ప్రభుత్వం ఎయిడెడ్ విద్యాసంస్థలను స్వాధీనంచేసుకోవడానికి ఉబలాటపడుతోందని టీడీపీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్ స్పష్టంచేశారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21(ఏ) ప్రకారం దేశంలో ప్రతిఒక్కరికీ నాణ్యమైన, ఉచితవిద్యను అందించాలనే నిబంధన ఉందని, అది కేవలంప్రాథమికహక్కే కాదని ప్రభుత్వాల బాధ్యతని టీడీపీ నేతతెలిపారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తమకంటూ సొంత రాజ్యాంగాన్ని అమలుచేస్తూ, ప్రజలకు అనేకసమస్యలు సృష్టిస్తోందన్నా రు. ప్రభుత్వ సహాయసహాకారాలు లేకున్నా వాటికవే స్వచ్ఛందంగా ముందుకు వెళుతున్న వ్యవస్థలనుకూడా పాలకులు కబళించాలని చూడటం బాధాకరమని జగదీశ్ వాపోయారు. ఎయిడెడ్ విద్యాసంస్థలను స్వాధీనంచేసుకోవడానికి ప్రభుత్వం వరుసగా జీవోలు ఇవ్వడం దుర దృష్టకరమన్నారు.
భారతరాజ్యాంగంలోని ఆర్టికల్ 21(ఏ)లో 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత, నిర్బంధవిద్యను అమలుచేయాలని ఉందని, అది ప్రతిఒక్కరికీ ఉన్న ప్రాథమిక హక్కని ద్వారపురెడ్డి చెప్పా రు. ఆర్టికల్ 21 (ఏ) ప్రకారం అన్నిరాష్ట్రాలు ఉచితంగా విద్యను అందిం చాల్సి ఉండగా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందుకుపూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. బ్రిటీష్ వారు కూడా ఆనిబంధనప్రకారమే ఎయిడెడ్ విద్యావిధానాన్ని బలోపేతం చేశారన్నారు. టీడీపీప్రభుత్వంలో స్వర్గీయఎన్టీఆర్, చంద్రబాబునాయుడు అధికారంలోఉన్నప్పుడు ఎయిడెడ్ విద్యాసంస్థలకు అన్నిరకాలుగా సహాయసహాకారాలు అందిం చడం జరిగిందన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎయిడెడ్ విద్యా సంస్థలకున్న ఆస్తులపై కన్నేసి, బలవంతపు కమిటీలతో వాటిని కబళించడానికి ఆరాటపడుతోందన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఎయిడెడ్ సంస్థల్లోని అధ్యాపకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసు కోకుండా జగన్ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రంలో ఉన్న 2,500 ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వం లేకుండాచేయడం వల్ల, 2.50లక్షలమంది విద్యార్థుల భవిష్యత్ అంధకారం కానుందన్నారు.
ఎయిడెడ్ విద్యాసంస్థలు ప్రైవేట్ విద్యాసంస్థలుగా మార్చడం వల్ల, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21(ఏ)కు ముమ్మాటికీ విఘాతం కలుగుతుంద ని జగదీశ్ వాపోయారు. ఎయిడెడ్ విద్యా సంస్థలైన మాన్సాస్ ట్రస్ట్ పరిధిలోని విద్యాలయాలు, విజయవాడలోని లయోలా, గుంటూరులోని ఏసీ కాలేజ్ వంటివి లేకుండా చేయడం వల్ల ఎంతమంది నష్టపోతారనే ఆలోచన ప్రభుత్వంచేయడంలేదన్నారు. కాంట్రాక్ట్ అధ్యాపకులకు చంద్ర బాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా, రూ.18వేలుగా ఉన్న జీతాన్ని రూ.37వేలకు పెంచడం జరిగిందన్నారు. ఎయిడెడ్ విద్యాసం స్థల్లోని అధ్యాపకులతో టాయిలెట్లు కడిగించడం ఈ ప్రభుత్వానికే చెల్లిం దన్నారు. ప్రభుత్వ విధానంతో, చివరకు విద్యార్థులు, వారి తల్లిదండ్రు లు అమ్మఒడి మాకొద్దు, మా బడే మాకు ముద్దనే పరిస్థితి వచ్చిందన్నా రు. చంద్రబాబునాయుడి గారి నాయకత్వంలో ఎయిడెడ్ విద్యాసంస్థల ను కాపాడుకోవడానికి తామందరం కృషిచేస్తామని, ప్రభుత్వం విద్యా సం స్థలను స్వాధీనంచేసుకోవడానికి వ్యతిరేకంగా పోరాడుతామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎయిడెడ్ విద్యావిధానాన్ని తిరిగి యథాతథంగా రాష్ట్రమంతా కొనసాగించి తీరుతామని జగదీశ్ తేల్చిచె ప్పారు.

Leave a Reply