-సినిమా చూస్తే ప్రజలు ఛీ కొడతారని జగన్ రెడ్డి భయపడ్డారు
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు
రాజధాని ఫైల్స్ సినిమా ప్రదర్శనను జగన్ రెడ్డి అడ్డుకోవడం పిరికిపంద చర్య. విపక్షంలో ఉన్నప్పుడు రాజధాని ఏర్పాటును స్వాగతిస్తున్నాని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే మూడు రాజధానుల పేరుతో డ్రామాలు ఆడింది వాస్తవం కాదా? 276 మంది రైతులను పొట్టన పెట్టుకుని, వేలమంది రైతు కుటుంబాలను రోడ్డున పడేసింది నిజం కాదా? సామాజిక బాధ్యతతో వాస్తవాలను సినిమాగా తీస్తే తప్పెలా అవుతుంది?
మీరు చేసిందే కదా వాళ్లు చూపించింది..మరి ఉలుకెందుకు? మొన్నటి వరకూ మూడు రాజధానులు అన్నారు. ఇప్పుడు ఉమ్మడి రాజధాని అంటున్నారు. మీ ఐదేళ్ల పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇంకెన్ని నాటకాలు ఆడతారు? మీ రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడతారా?
సినిమాలో ఎవరికీ కించపరిచేలా సన్నివేశాలు లేవు. కేవలం రాజధాని రైతుల ఆవేదనను మాత్రమే చూపించే ప్రయత్నం చేశారు.
దానికే తాడేపల్లి ప్యాలెస్ వణికిపోతోంది. రాజధాని ఫైల్స్ సినిమా చూస్తే తనను ప్రజలు ఛీ కొడతారని జగన్ రెడ్డి రెడ్డి భయపడ్డారు. సినిమా ప్రదర్శనను అడ్డుకున్న జగన్ రెడ్డి… ఐదేళ్ల తన చెత్త పాలనపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను ఆపగలరా ? ఎన్ని జిమ్మిక్కులు చేసిన ,ఎన్ని కుట్రలు చేసినా రానున్న ఎన్నికల్లో జగన్ రెడ్డి ఓడిపోవడం ఖాయం. తెలుగుదేశం-జనసేన కూటమి గెలుపు ఖాయం.