కలెక్టర్లనే బెదిరించిన మంత్రి పెద్దిరెడ్డి జిల్లాలో ఎన్నికల్లో అల్లర్లకు అవకాశం

– 2021 స్థానిక సంస్థల ఎన్నికల సంధర్బంలో ఎన్నికల సంఘాన్ని దూషిస్తూ, జిల్లా కలెక్టర్లను బెదిరించిన వైకాపా మంత్రి పెద్దిరెడ్డి.. రాబోయే సాధారణ ఎన్నికల్లో సైతం చిత్తూరులో అరాచకాలు సృష్టించే అవకాశం ఉందంటూ కమీషన్ కు లేఖ రాసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

• 2021 లో వైకాపా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సాక్షాత్తు మీడియా సమక్షంలో ఎన్నికల సంఘాన్ని దూషించి, కలెక్టర్లను బెదిరించారు.
• రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం చేసిన నిరంకుశ పాలన తీరుపై గతంలో ఎన్నికల సంఘానికి అనేకమార్లు ఫిర్యాదు చేశాం. వాటిని మరోమారు మీ దృష్టికి తీసుకొస్తున్నాం.
• స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారపార్టీ వైకాపా నాయకులు అనేక అరాచకాలకు పాల్పడ్డారు.
• పోటీ చేయాలనుకున్న వారి నామినేషన్ పత్రాలు బలవంతంగా లాక్కెళ్లారు. నామినేషన్ కేంద్రంలోకి సైతం వారిని అనుమతించలేదు.
• వైకాపా గూండాలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను సైతం లెక్కచేయలేదు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పై మౌఖిక దాడులకు దిగారు.
• దీంతో తనను, తన కుటుంబ సభ్యులను అధికారపార్టీ నేతలు బెదిరిస్తున్నారని..ఎస్.ఈ.సీ రక్షణ కల్పించాలని కేంద్ర హోంశాఖా కార్యదర్శికి లేఖ రాయాల్సి వచ్చింది.
(నాడు పెద్దరెడ్డి కలెక్టర్లను బెదిరిస్తూ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌ను లేఖకు జత చేసిన అచ్చెన్న)
• ఆ వీడియోలో మంత్రి పెద్దిరెడ్డి అహకారపూరిత ధోరణి, రాష్ట్ర ఎన్నికల సంఘంపై ఆయన చేసిన వ్యాఖ్యలను చూడొచ్చు.
• చిత్తూరు జిల్లా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు బోర్డర్ లో ఉంది. చిత్తూరు నుంచి పెద్ద ఎత్తున ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతోంది. ఇందులో పెద్దిరెడ్డి పాత్ర ఉంది.
• పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లాకు చెందిన వాడు కావడంతో అరాచకాలు, అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది.
• చిత్తూరు జిల్లా రాజకీయ పరిస్థితులపై స్వతంత్ర ఏజెన్సీతో విచారణ చేయించి శాంతియుత ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోండి.
• పారదర్శక ఎన్నికలు నిర్వహణకు పెద్ద సంఖ్యలో కేంద్ర బలగాలను, పరిశీలకులను నియమించండి

Leave a Reply