Home » చేనేత, స్వర్ణకారులను ఆదుకుంటాం

చేనేత, స్వర్ణకారులను ఆదుకుంటాం

-మంగళగిరిని గోల్డెన్‌ హబ్‌గా తయారుచేస్తాం
-ప్రజా ప్రభుత్వం వచ్చాక ప్రోత్సాహకాలు అందిస్తాం
-ఎన్నికల ప్రచారంలో నారా బ్రాహ్మణి భరోసా

మంగళగిరి: చంద్రబాబు పాలనలో అమరావతికి వచ్చి వెళ్లే వారితో మంగళగిరిలో వ్యాపారాలు బాగా సాగాయని, గడిచిన ఐదేళ్లుగా వ్యాపారాలు లేక ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొం టున్నామని నారా బ్రాహ్మణి ఎదుట చేనేత వ్యాపారులు, స్వర్ణకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బ్రాహ్మణి మంగళవారం మంగళగిరిలోని పలు కాలనీల్లో పర్యటించారు. షరీఫ్‌ బజార్‌లో బంగారు షాపులు, ఆభరణాల తయారీ యూనిట్‌ను పరిశీలించారు. వ్యాపారాలు సాగుతున్న తీరు, బంగారం తయారీ విధానం గురించి షాపుల యజమా నులను అడిగి తెలుసుకున్నారు. ఓ జ్యువెలరీ షాపులో స్వయంగా జుమ్కీలు కొనుగోలు చేశా రు. లోకేష్‌ను గెలిపించడం ద్వారా మంగళగిరిని గోల్డెన్‌ హబ్‌గా తయారుచేసుకుందామని వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు.

చేనేతకు కేరాఫ్‌ మంగళగిరి
మంగళగిరిలో చేనేతకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు నారా లోకేష్‌ అహర్నిశలు కృషి చేస్తున్నారని బ్రాహ్మణి అన్నారు. ప్రచారంలో భాగంగా పలు షాపుల్లో చేనేత వస్త్రాలను స్వయం గా పరిశీలించారు. అనంతరం మంగళగిరి పట్టు చీరలను కొనుగోలు చేశారు. ఎన్నికల తర్వాత లోకేష్‌తో కలిసి మంగళగిరిలో పర్యటిస్తానని చెప్పారు.

పచ్చళ్ల తయారీ కేంద్రం పరిశీలన
మంగళగిరి పట్టణంలో విజయ పచ్చళ్ల తయారీ కేంద్రాన్ని నారా బ్రాహ్మణి పరిశీలించారు. వర్కర్లతో కలిసి ఆవకాయ పచ్చడిని కలిపారు. నిర్వాహకులు తయారు చేసిన కొత్త ఆవకాయ పచ్చడిని రుచి చూశారు. పచ్చడి తింటుంటే చిన్నప్పుడు అమ్మ పెట్టిన ఆవకాయ గుర్తొస్తోం దన్నారు. చిరు వ్యాపారులు తమ కాళ్లపై తాము నిలబడి ఉపాధి పొందేలా అన్ని రకాలుగా సహాయ, సహకారాలు అందిస్తామని చెప్పారు. అనంతరం చెరకు రసం అమ్మే మహిళతో మాట్లాడారు. చెరకు రసం తాగారు. తనకు సొంతిల్లు లేదని, లోకేష్‌కు చెప్పి ఇప్పించాలని ఆ మహిళ కోరగా తప్పకుండా సొంతింటి కల నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు.

Leave a Reply