Home » కూటమి మేనిఫెస్టోలో ప్రధాన హామీలు

కూటమి మేనిఫెస్టోలో ప్రధాన హామీలు

టీడీపీ మేనిఫెస్టోను మంగళవారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ప్రకటించారు. వాటిలో ప్రధానమైనవి…
మెగా డీఎస్సీపై తొలి సంతకం, వృద్ధాప్య పెన్షన్‌ రూ.4000, దివ్యాంగులకు రూ.6000, కిడ్నీ, తలసేమియా బాధితులకు రూ.10 వేలు పెన్షన్‌, 100 శాతం అంగవైకల్యం ఉన్న వారికి రూ.15 వేలు పెన్షన్‌, 18-59 ఏళ్ల మధ్య ప్రతి మహిళకు రూ.1500, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, యువతకు 20 లక్షల ఉద్యోగాలు/ రూ.3000 నిరుద్యోగ భృతి, తల్లికి వందనం కింద ఏడాదికి ఒక్కో బిడ్డకు రూ.15 వేలు, మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితం, ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు పెట్టుబడి సాయం, వాలంటీర్లకు గౌరవ వేతనం నెలకు రూ.10 వేలు, ఉచిత ఇసుక విధానం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, భూ హక్కు చట్టం రద్దు, ప్రతి ఇంటికి ఉచిత ట్యాప్‌ కనెక్షన్‌, బీసీ రక్షణ చట్టం, పూర్‌ టూ రిచ్‌ పథకం, చేనేతకు 200 యూనిట్లు, మరమగ్గాలుంటే 500 యూనిట్ల ఉచిత విద్యుత్‌, కరెంటు చార్జీల నియంత్రణ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్‌, పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్ల ఇళ్ల స్థలం, పేదలకు నాణ్యమైన ఇంటి నిర్మాణం, పెళ్లి కానుక కింద రూ.లక్ష సాయం, విదేశీ విద్య పథకం పునరుద్ధరణ, పండుగ కానుకల పునరుద్ధరణ, న్యాయవాదులకు రూ.10 వేలు స్టైఫండ్‌, అక్రిడేషన్‌ జర్నలిస్టులకు ఉచిత నివాస స్థలం, మత్స్యకారులకు వేట విరామ సమయంలో రూ.20 వేలు సాయం.

Leave a Reply