బాలీవుడ్  ప్రముఖ గజల్ సింగర్ పంకజ్ ఉదాస్ కన్నుమూత

బాలీవుడ్  ప్రముఖ గజల్ సింగర్ పంకజ్ ఉదాస్ కన్నుమూశారు. 72 ఏళ్ల పంకజ్ ఉధాస్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చికిత్స పొందుతూ ఆయన కాసేపటి క్రితమే కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. పంకజ్ ఉదాస్ గుజరాత్‌లోని  జెట్‌పూర్‌లో జన్మించారు. ఆయన 1970లో తొలిసారి ‘తుమ్ హసీన్ హై జవాన్‌’ మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన గాత్రంతో ఎన్నో ఏళ్లుగా అలరించారు. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. దీంతో ఆయన సేవలను గుర్తించి ప్రభుత్వం 2006లో పద్మశ్రీతో సత్కరించింది. ఆయన మరణం తెలిసిన పలువురు సంతాపం తెలుపుతున్నారు.

ఆయన మరణవార్తను కూతురు నయాబ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. ‘బరువైన హృదయంతో.. దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా ఫిబ్రవరి 26వ తేదీన పద్మశ్రీ పంకజ్‌ ఉధాస్‌ మరణించిన విషయం తెలియజేయడానికి చింతిస్తున్నాము’ అని పోస్ట్ పెట్టారు.

Leave a Reply