పైడితల్లి అంటే ..
మా ఇలవేల్పు మాత్రమే కాదు..
మా చరిత్ర..
మా సంస్కృతి..
మా సంస్కారం..
మా పురస్కారం..
మా నమస్కారం..
మా నమోస్కారం..
మా మనోస్కారం..
మా ఉపారం..
మా తరతరాల ఆహారం..
మా ఊరి మనోహరం..
మా ఉత్సవం..
మా ఇంటింటి ఉత్సవం..
మా మహోత్సవం..
మా అమ్మకి ఏటా జరిగే
బ్రహ్మోత్సవం..
మా జనం..
మా ప్రభంజనం..
మా జాతర..
మా సాయం..
మా వ్యవసాయం..
మా ఫలసాయం..
మా సంస్కృతీ కదంబం..
మా గంటస్తంభం..
మా పొయ్యి మీది కుంభం
మా లాభం..
మా సౌరభం..
మా వ్యవసాయానికి
శ్రీకారం
మా సాగు.. మా సొబగు..
మా బాగు..
మా జీవిత సరంగు
మా ద్వారం కమాను..
మా గురజాడ కలమాను..
మా ఆర్థిక కొలమాను..
మా సంగీత అనురక్తి…
మా యుక్తి..మా ధీయుక్తి..
మా చెక్కుచెదరని భక్తి..
మా కోట శక్తి…
మా నింగిలో మెరిసే
జాబిల్లి..
మా ఉత్తరాంధ్ర కల్పవల్లి..!
– పైడితల్లికి నమస్సులతో..
ఎలిశెట్టి సురేష్ కుమార్
విజయనగరం
9948546286
7995666286