వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరిచేయండి

– సైకో జగన్ శని వదిలిద్దాం.. రండి!
– వైసీపీలో నేతలకు మర్యాద లేదు
– ఆత్మగౌరవం ఉన్నవారెవరూ వైసీపీలో ఉండరు
– వైసీపీ నేతలు తప్పు తెలుసుకుంటున్నారు
– టీడీపీలో చేరి అభివృద్ధికి తోడ్పడండి
– మరికొద్దిరోజుల్లో మిత్రపక్షాల ప్రజాపాలన
– మాజీ మంత్రి, సత్తెనపల్లి టీడీపీ అభ్యర్ధి కన్నా పిలుపు
– కన్నా సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు

సత్తెనపల్లి: ‘‘గత ఎన్నికల్లో జగన్ మాయమాటలు నమ్మి మోసపోయిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటికైనా కళ్లు తెరచి టీడీపీలో చేరడం సంతోషం. ఇక ఆ సైకో పని అయిపోయింది. సైకో జగన్ శనివదిలిద్దాం. తలా ఓ చేయివేయండి. నియంత పాలన కూల్చి ప్రజాపాలన తెచ్చుకుందాం’’ అని మాజీ మంత్రి, సత్తెనపల్లి టీడీపీ అభ్యర్ధి కన్నా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు.

సత్తెనపల్లి రూరల్ మండలం కంటేపూడి, రెంటపాళ్ల గ్రామాలలో గుంటూరు ఆశీర్వాదం, కోమెర శ్రీను ఆధ్వర్యంలో పలువురు వైసీపీ కార్యకర్తలు, ఎస్సీ కుటుంబాలు పెద్ద సంఖ్యలో కన్నా సమక్షంలో టీడీపీలో చేరాయి. వారికి పార్టీ కండువా వేసి టీడీపీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ.. రాష్ట్రానికి జగన్ శని వదలబోతోందని, సత్తెనపల్లి ప్రజలు ఆ శనిని నల్లగొండ సరిహద్దు దాటేవరకూ తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. వైసీపీలో ఆత్మాభిమానం ఉన్న వారెవరూ కొనసాగలేరని, నియంత రాజ్యంలో వైసీపీ సాధారణ సర్పంచులు కూడా బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పుణ్యాన సర్పంచులు బిచ్చం ఎత్తుకుని తిరుగుతున్నారని, వాలంటీర్లను తెచ్చి జగన్ వారిని అవమానిస్తున్నారని వ్యాఖ్యానించారు. గ్రామాల్లో వైసీపీ సర్పంచులు ఇప్పటికయినా కళ్లు తెరచి టీడీపీలోకి వచ్చి, గ్రామాభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు.

 

Leave a Reply