Suryaa.co.in

Andhra Pradesh

ఇదేం (అ)రాజకీయం?

మనం చేసిన మంచే కంచేలా మనల్ని ఎలా కాపాడుతుందో …..
అదే మంచితనం ఒక్కోసారి ముల్లులా బాధను కూడా కలిగిస్తుంది!!

దీనికి చిన్న ఉదాహరణ మన రాజుగారు..
అదేనండి…..
రచ్చబండ రాజు గారు…
ఏపీ సీఎంకి పక్కలో బల్లెం…చెవిలో జోరీగ…పంటికింద రాయి…

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికి కావాల్సిన.విద్య, వినయం, సంస్కారం,వ్యాపారదక్షత
అంగ..అండ..అర్ధబలం తోపాటు నీతి,నిబద్ధత,
ఉన్నత విలువలు మూర్తీభవించిన తెలుగోడి సన్నిధి
ప్రజాభిమాన పెన్నిధి
తెలుగుపౌరుషం నిధి
కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మధ్యన వారధి
ప్రభుత్వ అరాచక రథాన్ని ఆపే సారథి
సీఎం అవినీతి పైనే సవాలు విసిరిన ప్రజా ప్రతినిధి

అలుపెరుగని
అవిశ్రాంత పోరాటధరి .
టీవీ మాధ్యమం ద్వారా నిత్యం ఏపీలో జరుగుతున్న
తప్పిదాలను బహిర్గతం చేస్తున్న పోరాట
దురంధరుడు

ఆయనే రఘురామకృష్ణ రాజు. నర్సాపురం లోక్ సభ ఎంపీ. వైసీపీ అధ్యక్షుడి పైనే రాజీలేని రచ్చ చేస్తున్న రాజితడు.

ఇతను పార్టీకి ఒక ఎసెట్
ఇతని ఉనికి పార్టీకే క్రెడిబిలిటీ
ఇతను పార్టీకే బలం…బలగం

ప్రత్యక్షంగా ఎదుర్కొనే వాడిని మగాడoటారు . కానీ ఇలా పరోక్ష రాజకీయం చేస్తున్న వాడిని మాడా అంటారు. ఇలా కాలాన్ని దాట వేయగలరేమో కానీ…గెలుపు గుర్రాన్ని ఆపలేరుగా!

ఎలక్షన్స్ సమీపిస్తున్న తరుణంలో మూడు పార్టీలు కలిసి ఇప్పటికీ 30 సార్లు సమాలోచనలు.. కరచాలనాలు… కలుసుకోవటాలు..చర్చలు ..మార్పులు… చేర్పులు… మరకలు ..మలుపులు,..
అలకలు..చురకలు.. సుదీర్ఘ మంతనాలు.. ఆలోచనలు…వ్యూహాలు.. సిఫార్సులు…. అధిష్టాన ఆంతర్యo మాత్రం ఎవ్వరి ఊహకు అందడం లేదు.

ఎటువంటి సిద్ధాంతాలు లేని వైసీపీ ప్రభుత్వమే అలవోకగా అభ్యర్థులను ఎంపిక చేస్తుంటే… ఒక వైపు జాతీయ పార్టీ…మరోవైపు సుదీర్ఘ కాలంగా ఉన్న ప్రాంతీయ పార్టీ … ఒక సిట్టింగ్ ఎంపి పేరును ప్రకటించడానికి తాత్సారం. ఎందుకు? మీనమేషాలు లెక్కపెట్టడం ఎందుకు? ఎవ్వరికి అర్థం కాని ప్రశ్న?

తోడేలు వ్యూహన్ని పసిగట్టలేక బందీ అయిన దొర ఈయన. అంతేకానీ దొంగ
దెబ్బ తీయటం చేత కాక కాదు. నైతిక విలువలకు కట్టు బడే వ్యక్తి కాబట్టే న్యాయపోరాటానికి సిద్ధమైన ఉత్తముడు.
ఎంపీ గా తను కర్తవ్యాన్ని అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తున్న వ్యక్తికి మీరిచ్చే గౌరవం ఇదా చివరకు.?
ఒక నిఖార్సైన నిజాన్ని దరి చేర్చుకోటానికే ఇన్ని తప్పటడుగులా? ఇంత వెనుకంజా?ఎత్తుల పైఎత్తులా? మిత్ర బేధాలా?

సిట్టింగ్ ఎంపీ పేరు ఉచ్చరించటానికి నోరు పెగలటం లేదా?
మా జాతకాల్ని కూడా బయటేస్తాడని భయమా?
ఇక పై ఆగడాలు సాగవని జాగ్రత్త పడుతున్నారా?
చేసిన గుట్టు అంతా రట్టు అవుతుంది
సందేహ పడుతున్నారా?

అనూహ్యమైన ఈ అడ్డంకులు సృష్టిస్తున్న అదృశ్య శక్తులు ఎవరు?
దీన్ని వివక్ష అనాలా.?..
అసూయ అనాలా?

ఒక్కటి మాత్రం స్పష్టమవుతోంది. కేంద్ర పెద్దలకు ఇతను మనవెంట ఉంటే రేపు మీ బండారాన్ని, మా భాగవతాన్ని కూడా 70mm స్క్రీన్ మీద ప్రజలందరికీ చూపిస్తాడని హెచ్చరిస్తున్నారు. బహుశా అదే ఈ అలసత్వాన్ని కారణం కాబోలు !!

ఒకవేళ రాజు బీజేపీ నుంచి గెలిస్తే మంత్రి అవుతారేమోనన్న శంకా లేకపోలేదు.

జగన్ తో చేతులు కలిపిన రాజు మిత్రులందరికీ నా మనవి. నరసాపురం ఎవరికి కేటాయిస్తే ఆ పార్టీ నుంచే పోటీ చేస్తానని పదే పదే చెప్తున్నా కూడా కాదని, ఇంకొక పేరుని ప్రతిపాదిస్తున్న మీ నైజం ఏంటో జనానికి సుస్పష్టం మైంది. మీరు ఎదగరు… బీజేపీని ఎదగనివ్వరు… మీకు
వివాహం ఒకరితో …వ్యవహారం ఇంకొకరితో. ఇదే మీ వైఖరి అందుకే ఇప్పుడొచ్చారు తెరపైకి.

లగ్న పత్రిక రాసుకున్న తర్వాత అంతా ఒకే కుటుంబం అన్న భావన లేకుండా ఇంకా… ఉక్రోషాన్ని కక్కుతూ విద్వేషాలు రెచ్చగొడుతున్న మీ గుట్టు పెరుమాళ్లకు తెలుసో లేదో కానీ.. మాకు ఎరుక అయింది.

మీకు ప్రజల పట్ల బాధ్యత…
పార్టీ పట్ల కమిట్మెంట్ ….
కూటమి గెలవాలన్న కోరిక కానీ ఏమీ లేవు?
కేవలం ఎదుటివాడి కన్ను పోతే చాలు.

ఓడించటానికి కుట్ర చేయటం విన్నా కానీ…. అభ్యర్థి ఎంపికకే కుయుక్తులు పన్నటం ఇప్పుడే చూస్తున్నాo!! నేటి ప్రజాస్వామ్యానికి కావాల్సింది ఇలాంటి నాయకుడేనని అధిష్టానానికి కూడా
తట్టకపోవడం దారుణం! విచారకరం!!

ఒక వ్యక్తి ఉన్నత స్థితికి వెళ్తాడేమో అన్న ఊహే మిమ్మల్ని నిద్రపోనీయటం లేదంటే… రాజుగారు!! మీరు నైతికంగా గెలిచినట్టేనండి! మీ అఖండ విజయ దుందిభిని ఎప్పుడెప్పుడు వీక్షిస్తామా అని జనమంతా ఎదురుచూస్తున్న శుభ ఘడియలు సమీపిస్తు న్నాయి.

ఒకడు ఎదిగేందుకు నువ్వు సహకరిస్తే, నువ్వు ఎదిగేందుకు పైవాడు సహకరిస్తాడు అని నమ్మి ముందుకు కదలటమే మీ ముందున్న కింకర్తవ్యం.

అంతా నావాళ్ళే అనుకునే మీకు ఇక్కడ కిరాయిగాళ్లు,పగవాళ్ళే తప్ప.. మీవాళ్ళు బహు తక్కువని ఇకనైనా తెలుసుకుంటారని ఆశిస్తూ….
ఈ అవమానం మీది కాదు…మీ శ్రేయస్సును సదా కోరుకునే మాది!

– డాక్టర్ సాధు

LEAVE A RESPONSE