బావ-బామ్మర్ది సవాల్!

– పార్టీ పెడతానని చెప్పకనే చెప్పిన బ్రదర్ అనిల్
-సీఎం అభ్యర్ధిని నిలబెడాతనని హామీ
– జగన్ అపాయింట్‌మెంట్ తనకు అవసరం లేదని వ్యాఖ్య
– బ్రదర్ అనిల్ వ్యాఖ్యల సంకేతం అదేనా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

గతంలో అన్నదమ్ముల సవాల్, మామా అల్లుళ్ల సవాల్, తండ్రీకొడుకుల సవాల్ వంటి సినిమాలు చూశాం. ఇకపై ఆంధ్రరాష్ట్ర రాజకీయ తెరపై ‘బావ-బామ్మర్దుల సవాల్’ (ఇదో ఫ్యామిలీ వార్) ట్యాగ్ లైన్‌తో పొలిటికల్ సినిమా చూడబోతున్నామా?.. ఏపీ సీఎం జగన్ బావ, క్రైస్తవ మత ప్రచారకుడు బ్రదర్ అనిల్ చేసిన వ్యాఖ్యలు ఇలాంటి సంకేతాలు ఇస్తున్నాయి.

ఇటీవల రాజమండ్రి వెళ్లి మాజీ ఎంపీ ఉండవల్లిని కలిసి సలహాలు తీసుకున్న బ్రదర్.. తర్వాత అమరావతి వెళ్లి పాస్టర్లు, ఫాదర్లు, బిషప్పులు, ఎస్సీ, బీసీ సంఘాల నేతలను కలిసిన వైనం సంచలనం
undavalli-anil నృష్టించింది. గత ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం భుజం పుండ్లు పడేలా జెండా మోసిన వారేనట. అంత కష్టపడినా జగనన్న పాలనలో తమకేమీ దక్కడం లేదన్నది బ్రదర్‌కు వారంతా చేసిన ఫిర్యాదు. ‘మీరేం భయపడవద్దు. నేనున్నా’ నని అనిల్‌బాబు కూడా అభయం ఇచ్చేశారట. దానితో అనిల్‌బాబు పార్టీ పెడుతున్నారంటూ కథనాలొచ్చాయి. అయితే దానిని ఆయన ఖండించారు. అది వేరే కథ.

తాజాగా అనిల్‌బాబు విశాఖలో ప్రత్యక్షమయ్యారు. యధావిథిగా క్రైస్తవ, దళిత, బీసీ వర్గ నేతలతో భేటీ అయ్యారు. అయితే అమరావతి పర్యటన తర్వాత రాజకీయ పార్టీ పెట్టడం లేదని చెప్పిన అదే

అనిల్‌బాబు.. వైజాగ్‌లో మాత్రం ‘ ఇక్కడ పార్టీ పెట్టమని నన్ను మీరంతా చాలా కాలం నుంచీ అడుగుతున్నారు. దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటా. రాజకీయ పార్టీ పెట్టడమంటే ఆషామాషీ కాదు. చాలా సీరియస్‌గా పనిచేయాలి. వర్క్ చేయాలి. మీరంతా నాకోసం గత ఎన్నికల్లో పనిచేశారు. అందువల్ల నేను మీ మాట వినాల్సిందే. సీఎంగా బీసీని పెట్టాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. దానిని కచ్చితంగా నెరవేరుస్తా’నన్న అనిల్ వ్యాఖ్యలు పరిశీలిస్తే.. కొత్త పార్టీ స్థాపనకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. అంటే అమరావతి పర్యటనటకు-విశాఖ పర్యటనకు మధ్య ఉన్న నాలుగురోజుల్లోనే, చాలా మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది.

Brother-Anil-Kumar-Tension-For-Jaganఈ సందర్భంగా సీఎం బావ జగన్‌తో తనకున్న విబేధాలు, పెరుగుతున్న దూరాన్ని కూడా అనిల్ వ్యాఖ్యలు చెప్పకనే చెప్పాయి. ‘ నాకే సీఎం జగన్ రెండేళ్ల నుంచి అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు’ అని సంచలన వ్యాఖ్యలు చేసిన అదే అనిల్‌బాబు..తాజాగా ‘నాకు సీఎం జగన్ అపాయింట్‌మెంట్ అవసరం లేదు. వైసీపీ పాలనలో క్రైస్తవులు-దళితులు-బీసీలు-ఎస్సీ-ఎస్టీలకు ఏమాత్రం న్యాయం జరగడం లేదు. దీనిపై సీఎంకు లేఖ రాస్తా. ఎన్నికల కోసం పార్టీ కోసం పనిచేసిన సంఘాలు ఇప్పుడు సాయం కోసం ఎదురుచూస్తున్నాయి. ఎవరి సాయం లేకుండా ఎవరూ పదవుల్లోకి రారు. నాయకులకు పాలించ మని ప్రజలే వారికి ఉద్యోగాలిచ్చిన విషయం గుర్తుంచుకోవాలి. ఏ విజయం ఏ ఒక్కరిదీ కాదన్నది గుర్తుంచుకోవాల’ని చేసిన వ్యాఖ్యలు, పరోక్షంగా సీఎం బావ జగన్‌కు చురకలు పెట్టినట్టే కనిపిస్తోంది.

కాగా తాజా అనిల్ విశాఖ పర్యటనలో చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే.. బ్రదర్ అనిల్ పార్టీ పెట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. బహుశా గత ఎన్నికల్లో తనతో కలసి పనిచేసిన వర్గాలన్నీ ఇప్పుడు తనతో మళ్లీ

వస్తాయా? రావా? మారిన రాజకీయ-కుటుంబ రాజకీయ పరిస్థితిలో అసలు తన కోసం పనిచేసే వారెంతమంది ఉన్నారు? దళితులు, ముఖ్యంగా క్రైస్తవుల మనోభావాలు ఏమిటన్న కీలక అంశాలను తెలుసుకునేందుకే బ్రదర్, వ్యూహాత్మకంగా ఒక్కో జిల్లాలో పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది.

గత అమరావతి పర్యటన సందర్భంలో, పార్టీ పెట్టే యోచన లేదని చెప్పిన అనిల్‌బాబు.. ఇపుడు ఏకంగా బీసీ అభ్యర్ధిని సీఎంను చేస్తామని హామీ ఇవ్వడం, జగన్ అపాయింట్‌మెంట్ తనకు అవసరం లేదని

చెప్పడం చూస్తుంటే, త్వరలో ‘బావ-బామ్మర్దుల సవాల్’ (ఇదో ఫ్యామిలీ వార్) అనే ట్యాగ్‌లైన్ టైటిల్‌తో పొలిటికల్ సినిమా విడుదల కావడం ఖాయమని స్పష్టమవుతోంది.

నిజానికి గత ఎన్నికల ముందు బ్రదర్ అనిల్ బావ జగన్ కోసం అహర్నిశలు కష్టపడ్డారు. దళిత-క్రైస్తవ జనాభా ఎక్కువగా ఉన్న జిల్లాల్లో స్వస్థత కూటమలు నిర్వహించి, ఆయా వర్గాలను జగన్ పార్టీ వైపు
Sharmila-Anil-Kumar మళ్లించారు. తర్వాత రాష్ట్రంలోని ప్రతి చర్చి ఫాదర్, పాస్టర్, బిషప్పులతో లోటస్‌పాండ్‌లో వారాంతర సమావేశాలు నిర్వహించి, జగన్ తమ బిడ్డగా భావించి ఆయనను గెలిపించాలని కోరారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరెవరూ జగన్ వద్దకు వెళ్లాల్సిన పనిలేదని, తమ వద్దకు వస్తే అన్ని సమస్యలూ పరిష్కరిస్తామని వారు సభాముఖంగా హామీలిచ్చారు.

ఈ సమావేశాల్లో జగన్ తల్లి విజయలక్ష్మి, షర్మిలతోపాటు వైఎస్ సోదరి విమలారెడ్డి కూడా హాజరయిన విషయం తెలిసిందే. జగన్ జైలుకు వెళ్లిన తర్వాత ఆయన పాదయాత్రను షర్మిల కొనసాగించి రికార్డు
bro-anil సృష్టించారు. ఆ రకంగా జగన్ సీఎం అయేందుకు రెక్కలు ముక్కలు చేసుకున్న షర్మిల కుటుంబాన్ని జగన్ నిర్లక్ష్యం చేసి, భార్య మాటకే విలువ ఇస్తున్నందుకే షర్మిల-అనిల్ తిరుగుబాటు చేశారని, ఈ వ్యవహారంలో విజయమ్మ కూడా షర్మిల వైపే ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది.

anil-ysrమరోవైపు కుటుంబ ఆస్తుల పంపకాల్లో భాగంగా తెలంగాణలో ఉన్న వివాదాస్పద భూములన్నీ షర్మిలకు పంచి, ఎలాంటి వివాదం లేని భూములను మాత్రం జగన్ తీసుకున్నారన్న ప్రచారం షర్మిల పార్టీలో జరుగుతోంది. సాక్షి మీడియాలో తాను కూడా భాగస్వామినేనని ఇటీవ ల షర్మిల ఎబీఎన్ రాధాకృష్ణ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే.

Leave a Reply